×
Ad

Rana Daggubati : త్రివిక్రమ్ రచనతో రానా ‘హిరణ్యకశిపుడు’.. అమెరికా వెళ్ళింది ప్రభాస్ కోసం కాదు..

రానా దగ్గుబాటి కామిక్ కాన్ కి వెళ్ళింది ప్రభాస్ ప్రాజెక్ట్ K కోసం కాదు. తన పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీస్ ని అనౌన్స్ చేయడానికి వెళ్ళాడు. హిరణ్యకశిపుడు, లార్డ్స్ అఫ్ ది డెక్కన్, మిన్నల్ మురళి..

  • Published On : July 19, 2023 / 06:14 PM IST

Rana Daggubati announce Hiranyakashyap Lords Of The Deccan at COMIC CON

Rana Daggubati : అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో ప్రాజెక్ట్ K (Project K) టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ప్రభాస్ (Prabhas) అండ్ తన మూవీ టీం ఇటీవల అమెరికాలో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. అయితే వారితో పాటు రానా దగ్గుబాటి ఫోటోని కూడా షేర్ చేశారు ప్రాజెక్ట్ K చిత్ర యూనిట్. దీంతో రానా తన స్నేహితుడు ప్రభాస్ కోసం అమెరికా వరకు వెళ్లాడని అందరూ అనుకున్నారు. కానీ రానా కూడా అక్కడికి తన సినిమాలను అనౌన్స్ చేయడానికి వెళ్లాడని ఇప్పుడే తెలుస్తుంది.

Eesha Rebba : అభిమానుల‌కు షాక్ ఇచ్చిన హీరోయిన్ ఈషా రెబ్బా.. పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలు.. తండ్రి ఎక్క‌డంటే..?

రానా నటించబోయే మరియు నిర్మించే పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీస్ ని అనౌన్స్ చేయడానికి కామిక్ కాన్ అటెండ్ అయ్యాడు. రానా నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా (Spirit Media) నుంచి త్వరలో హిస్టారికల్ ఎపిక్ యాక్షన్ డ్రామా సిరీస్ అండ్ మూవీస్ రాబోతున్నాయి. వాటిలో ఒకటి రానా హీరోగా నటించబోయే హిరణ్యకశిపుడు (Hiranyakashyap). ఈ ప్రాజెక్ట్ గురించి ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని రానా పట్టాలు ఎక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ కామిక్ స్టోరీ ‘అమర్ చిత్ర కథ’ స్పూర్తితో ఈ సినిమా కథని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాస్తున్నాడు.

Gandeevadhari Arjuna : గాండీవధారి అర్జున టీజర్‌కి టైం లాక్ చేసిన ఏజెంట్.. గెట్ రెడీ..!

ఇక ఈ చిత్రంతో పాటు చాళుక్య సామ్రాజ్యం పై లార్డ్స్ అఫ్ ది డెక్కన్ (Lords Of The Deccan) అనే సిరీస్ ని నిర్మించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ సిరీస్ రూపంలో రాబోతుంది. అలాగే మలయాళం నుంచి ఇటీవల వచ్చిన సూపర్ హీరో మూవీ మిన్నల్ మురళి (Minnal Murali). టోవినో థామస్ హీరోగా నటించిన ఈ సూపర్ హీరో మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు ఆ మూవీ నిర్మాతలతో రానా కలిసి మిన్నల్ మురళి కామిక్ వెర్షన్ ని నిర్మించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిని రానా అక్కడ అనౌన్స్ చేసి ఇండియన్ సినిమాని ఇంకొంచెం ముందుకు తీసుకు వెళ్లబోతున్నాడు.