Rana Daggubati : ప్రభాస్, మహేష్ బాబు ఎవరో బాలీవుడ్ వాళ్లకు తెలీదంట.. రానా సంచలన వ్యాఖ్యలు..
బాలీవుడ్ లో తెలుగు హీరోల హవా గురించి అడగగా రానా సమాధానమిస్తూ.. ఇప్పుడు తెలుగు హీరోల సినిమాలు బాలీవుడ్ లో బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. నా ఘాజీ సినిమా హిందీలో కూడా చేశాను. నేను బాహుబలి షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు ఒకసారి ముంబై వచ్చాను. అప్పుడు ముంబైకి చెందిన ఓ ఫ్రెండ్..................
- Saketh U
- Published On : March 4, 2023 / 09:54 AM IST
Rana Daggubati sensational comments on prabhas and mahesh babu he sai they dont know in bollywood
Rana Daggubati : ఇప్పుడు తెలుగు సినిమా దేశమంతటా విస్తరించింది. మన హీరోలు అయితే పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. ఇప్పుడు మన హీరోల సినిమాల కోసం బాలీవుడ్ వాళ్ళు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సమయంలో రానా మన హీరోలపై ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. రానా, వెంకటేష్ తో కలిసి త్వరలో రానా నాయుడు అనే సిరీస్ తో రాబోతున్నాడు. నెట్ ఫ్లిక్స్ స్వయంగా ఈ సిరీస్ ని నిర్మిస్తుంది. పాన్ ఇండియా సిరీస్ గా అన్ని భాషల్లో రానా నాయుడు మార్చ్ 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా రానా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్, మహేష్ బాబు బాలీవుడ్ వాళ్లకు తెలీదని వ్యాఖ్యలు చేశాడు.
బాలీవుడ్ లో తెలుగు హీరోల హవా గురించి అడగగా రానా సమాధానమిస్తూ.. ఇప్పుడు తెలుగు హీరోల సినిమాలు బాలీవుడ్ లో బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. నా ఘాజీ సినిమా హిందీలో కూడా చేశాను. నేను బాహుబలి షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు ఒకసారి ముంబై వచ్చాను. అప్పుడు ముంబైకి చెందిన ఓ ఫ్రెండ్ నన్ను ఏం సినిమా చేస్తున్నావు అని అడిగితే బాహుబలి అని చెప్పాను. అతను హీరో ఎవరు అని అడిగితే ప్రభాస్ అని చెప్పాను. అతను మళ్ళీ ప్రభాస్ ఎవరు అని అడిగాడు. దీంతో నేను ఆశ్చర్యపోయాను. అతనికి ప్రభాస్ తెలీదన్నాడు, ప్రభాస్ సినిమాలు ఏమి చూడలేదన్నాడు. అప్పుడు నేను.. కొన్ని రోజులు ఆగు మా ఆర్మీ అంతా బాలీవుడ్ లో ల్యాండ్ అవుతుంది అన్నాను. ఇప్పుడు అదే జరిగింది. అదే వ్యక్తి నాకు టాలీవుడ్ లో చిన్ను వాళ్ళ భర్త ఒక్కరే తెలుసు అని అనడంతో చిన్ను ఎవరు అని నేను ఆలోచించా. అప్పుడు అతను నమ్రత శిరోద్కర్ అని చెప్పాడు. మహేష్ బాబు నమ్రత భర్తగా తెలుసు అంటే నేను ఆశ్చర్యపోయాను. మన భాష పేరుతో సినిమాలను వేరు చేసుకుంటున్నాం. ఇప్పటికే అన్ని భాషల సినిమాలు అన్ని చోట్ల ఆడుతున్నాయి. త్వరలోనే భాషకి సంబంధం లేకుండా సినిమా అనే రోజు వస్తుంది అని అన్నాడు.
Telugu Indian Idol 2 : మొదలైన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2.. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఫస్ట్ ఎపిసోడ్..
దీంతో రానా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రభాస్, మహేష్ తెలియకపోవడం ఏంటి అని అంతా అనుకున్నారు. కానీ ఇదంతా బాహుబలి ముందు అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు మన తెలుగు హీరోల పేర్లు దేశవిదేశాల్లో వినిపిస్తున్నాయి.
