Rana Daggubati : చిరంజీవి సోషియో ఫాంటసీ సినిమా ‘మెగా 156’లో విలన్‌గా రానా దగ్గుబాటి? బాహుబలిని మించి..
చిరంజీవి(Megastar Chiranjeevi) ఇప్పుడు మెగా 156 సినిమాతో వసిష్ఠ దర్శకత్వంలో రాబోతున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. తాజాగా నిన్న దసరా రోజు సినిమా పూజా కార్యక్రమం నిర్వహించి ఆ వీడియోని కూడా విడుదల చేశారు.
- Saketh U
- Published On : October 25, 2023 / 08:44 AM IST
Rana Daggubati will play Villain role in Chiranjeevi Mega 156 Movie
Rana Daggubati : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఇప్పుడు మెగా 156 సినిమాతో వసిష్ఠ దర్శకత్వంలో రాబోతున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. తాజాగా నిన్న దసరా రోజు సినిమా పూజా కార్యక్రమం నిర్వహించి ఆ వీడియోని కూడా విడుదల చేశారు. అలాగే సినిమా మ్యూజిక్ వర్క్స్ కూడా మొదలుపెట్టేసారు. దీంతో వసిష్ఠ – చిరంజీవి సినిమా మెగా 156 సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు.
Also Read : Tharun Bhascker : కీడా కోలా సినిమాలో అల్లు అరవింద్‌ని నటించమని అడిగితే..
అయితే ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు అనేది ఇంకా ప్రకటించలేదు కానీ ఒక పేరు మాత్రం బాగా వినిపిస్తుంది. మెగా 156 సినిమాలో చిరంజీవికి విలన్ గా రానా దగ్గుబాటి నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రానా హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఆన్నారు. బాహుబలి సినిమాలో విలన్ గా ప్రభాస్ ని ఢీ కొట్టి మెప్పించారు. ఇప్పుడు చిరు సినిమాలో కూడా విలన్ గా నటించబోతున్నట్టు వార్తలు వస్తుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
