Animal Collections : జవాన్ కలెక్షన్స్ ని మించి యానిమల్ రికార్డు వసూళ్లు.. మూడు రోజుల్లో..

షారుఖ్ ఖాన్ 'జవాన్' కలెక్షన్స్ ని మించి యానిమల్ రికార్డు వసూళ్లు రాబడుతుంది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా..

  • Published On : December 4, 2023 / 03:55 PM IST

Ranbir Kapoor Animal movie beat Shah Rukh Khan Jawan three days Collections

Animal Collections : టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘యానిమల్’. రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోయిన్స్ గా నటించగా అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో కనిపించరు. నాన్న ఎమోషన్ ని వైల్డ్ గా చూపిస్తూ డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఫస్ట్ డే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 116 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది. రణబీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ ని ఇచ్చింది.

యూత్ ని బాగా ఆకట్టుకున్న ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్స్ మించి సెకండ్, థర్డ్ డే కలెక్షన్స్ అందుకుంది. రెండో రోజు సుమారు 120 వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. ఇక మూడో రోజు ఆదివారం దాదాపు 120 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకున్నట్లు మేకర్స్ తెలియజేశారు. దీంతో మొదటి వీకెండ్ పూర్తి అయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 356 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి బాలీవుడ్ లో కొత్త రికార్డుని సృష్టించింది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి కలెక్షన్స్ సునామీ సృష్టించి కొత్త రికార్డుని క్రియేట్ చేసింది.

Also read : Ajay Devgn Injured : సింగం 3 షూటింగ్‌లో గాయ‌ప‌డిన అజ‌య్ దేవ్‌గ‌ణ్..! కంటికి తీవ్ర గాయం..!

అయితే ఈ రికార్డుని ఇప్పుడు యానిమల్ బ్రేక్ చేసింది. జవాన్ మొదటి మూడురోజులు పూర్తి అయ్యేపాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ కలెక్షన్స్ ని మించి యానిమల్ మూవీ రాబట్టింది. ఓవర్ సీస్ లో కూడా ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతుంది. గ్లోబల్ వైడ్ వీకెండ్ కలెక్షన్స్ కూడా ఈ చిత్రం నెంబర్ వన్ గా నిలిచింది. ఈ వారం టాలీవుడ్ లో ‘హాయ్ నాన్న’ వంటి ఎమోషనల్ డ్రామా తప్ప మరో యాక్షన్ మూవీ లేదు. బాలీవుడ్ లో కూడా పెద్ద సినిమా రిలీజ్ ఏది లేదు. ప్రస్తుతం యానిమల్ కి ఉన్న క్రేజ్ చూస్తుంటే.. ఈ చిత్రం కూడా 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేలా ఉందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.