Ranbir kapoor: ‘రామాయణ’లో రణ్‌బీర్ డ్యూయెల్ రోల్.. ‘రాముడి’తోపాటు మరో పవర్ ఫుల్ రోల్.. క్లారిటీ ఇచ్చిన హీరో

రామాయణ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నట్టుగా ప్రకటించిన రణబీర్ కపూర్(Ranbir kapoor).

ranveer dual role in nitesh tiwari ramayan movie

  • రామాయణ నుంచి ఆసక్తికర అప్డేట్
  • రాముడిగానే కాదు మరో పాత్రలో కనిపించనున్న రణబీర్
  • ఒకే సినిమాలో రెండు మహావిష్ణువు అవతారాలు

Ranbir kapoor: బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ పౌరాణిక గాథలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, కన్నడ స్టార్ యశ్ రావణుడిగా కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ కపూర్(Ranbir kapoor) సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో తాను ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఆయన ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Sreemukhi: ఎరుపు రంగులో మెరిసిపోతున్న శ్రీముఖి.. హాట్ చూపులతో కుర్రకారు క్లీన్ బౌల్డ్

రణ్‌బీర్ కపూర్ ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రతో పాటు, శ్రీమహావిష్ణువు ఆరో అవతారమైన పరశురాముడి పాత్రలోనూ కనిపించబోతున్నారు. ఒకే చిత్రంలో రెండు పురాణ పురుషుల పాత్రలను పోషించే అవకాశం రావడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ పాత్రల కోసం తాను ఏడాది పాటు సమయం కేటాయించి రామాయణాన్ని లోతుగా అధ్యయనం చేసినట్లు తెలిపారు. కేవలం హావభావాలే కాకుండా, ఆ పాత్రల వెనుక ఉన్న ఆధ్యాత్మికతను, భావోద్వేగాలను అర్థం చేసుకుని నటిస్తున్నట్లు రణ్‌బీర్ వివరించారు.

నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దుబే వంటి అగ్ర తారలు ఇందులో భాగస్వాములవుతున్నారు. రణ్‌బీర్ కపూర్ చేస్తున్న ఈ డబుల్ రోల్ ప్రయోగం సినిమాపై అంచనాలను ఒక రేంజ్ లో పేచేశాయి. పరశురాముడి గంభీరమైన పాత్రలో రణ్‌బీర్ ఎలా ఒదిగిపోతారో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.