Ranveer Singh: రణవీర్ సింగ్.. బాలీవుడ్ లో విచిత్రమైన ఫ్యాషన్ కి చిరునామా. చిరిగిన బట్టలు, సగం సగం బట్టలు, ఆడవాళ్ళ బట్టలు వేసుకొని ఫొటోలకు ఫోజలు ఇస్తుంటాడు ఈ బాలీవుడ్ స్టార్ హీరో. అయితే ఈ ఫ్యాషన్ ని కొంతమంది అనుసరించే వాళ్ళు ఉన్నారు, అలానే ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ రణవీర్ ఇవేవి పట్టించుకోకుండా తనకి నచ్చినట్లు చేసుకొంటూ పోతుంటాడు.
Ranveer Singh : ఈ రచ్చ ఏందయ్యా.. వైరల్ అవుతున్న రణవీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్
ఇటీవల రణవీర్ ఒక మ్యాగజైన్ కోసం దిగిన న్యూడ్ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ సమయంలో ఆ ఫోటోలు కొంత రచ్చకు దారి తీశాయి. “న్యూడ్ ఫొటోలతో సమాజానికి ఏమి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారంటూ” కొంతమంది ప్రశ్నించగా, మరి కొంతమంది అయితే రణవీర్ సింగ్ పై కేసులు కూడా పెట్టారు. ఈ క్రమంలో రణవీర్ పోలిసుల విచారణకు హాజరు కాగా, ఆ న్యూడ్ ఫోటోలు తనవి కావంటూ బదులిచ్చాడంట.
అసలు న్యూడ్ ఫోటో షూట్ లే నేను చేయలేదు, ఆ ఫోటోలను ఎవరో మార్ఫింగ్ చేశారంటూ వాపోయారంట రణవీర్. “ఫోటోలను మార్ఫింగ్ చేసి ఉంటే ఆ ఫోటోలను పోస్ట్ చేసింది మాత్రం రణవీర్ సింగే కదా, అయినా వినేవాడు ఉంటే ఇలాంటి వాళ్ళు ఎన్ని అయినా చెబుతారంటూ” నెటిజెన్లు కామెంట్ లు చేస్తున్నారు. కాగా ఇప్పటికి ఆ న్యూడ్ ఫొటోస్ ని రణవీర్ ఇంకా తన ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించకపోవడం గమనార్హం.
.@papermagazine pic.twitter.com/RU2tzGNUOi
— Ranveer Singh (@RanveerOfficial) July 22, 2022