Rashmi Gautam : కోడి కోసం ట్విట్టర్‌లో కామెంట్ల పందానికి దిగిన రష్మీ..
తెలుగు స్టార్ యాంకర్ 'రష్మీ గౌతమ్' మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. కాగా ఈ అమ్మడికి మూగ జీవులు అంటే ప్రాణం. తాజాగా కోడి పందాల విషయంలో ఒక డాక్టర్ పై చేసిన కామెంట్స్ ట్విట్టర్ లో..
- gum 95921
- Published On : January 17, 2023 / 02:31 PM IST
Rashmi Gautam
Rashmi Gautam : తెలుగు స్టార్ యాంకర్ ‘రష్మీ గౌతమ్’ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఒక పక్క కామెడీ షోలు, సినిమా ఈవెంట్ లు చేస్తూనే మరో పక్క హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తుంది. కాగా ఈ అమ్మడికి మూగ జీవులు అంటే ప్రాణం. వాటికీ చిన్న హాని కలిగిన ఎంతో బాధ పడుతూ పోస్ట్ లు వేస్తుంటుంది. సంక్రాంతి సమయంలో గాలిపటాలకు మాంజా ఉపయోగించ వద్దంటూ, కోడి పందాలు లాంటివి జీవ హింస అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటది. ఈ విషయం పై సోషల్ మీడియాలో నిత్యం రష్మీ, నెటిజెన్లు మధ్య కామెంట్ల వార్ జరుగుతుంది.
Rashmi Gautam : యాంకర్ రష్మీపై రీసర్చ్ పేపర్ పబ్లిష్ చేయబోతున్న డెర్మటాలజిస్ట్..
తాజాగా మరోసారి ట్విట్టర్ లో ఈ కామెంట్ల వార్ మొదలయింది. సంక్రాంతి సందర్భంగా ఒక డాక్టర్ కోడి పందాల్లో పాల్గొని గెలిచాడు. ఆ ఆనందాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ.. ‘రెండు పందాలు గెలిచాను. సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేశాను’ అంటూ పోస్ట్ చేశాడు. ఇక ఆ పోస్ట్ చూసిన రష్మీ దానిని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేస్తూ.. నీ డాక్టర్ సర్టిఫికెట్ ని తీసుకువెళ్లి కుప్ప తొట్టిలో పడేయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ పోస్ట్ కి రియాక్ట్ అవుతూ నెటిజెన్లు రష్మికకు కౌంటర్ ఇస్తున్నారు.
అయితే వాటికీ రష్మీ కూడా తిరిగి కౌంటర్ లు ఏస్తుంది. అందులో ఒక నెటిజెన్.. ‘కోడికి లేని బాధ మీకెందుకు మేడం. అది మా గర్వం కాదు. మా సంప్రదాయం’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి రష్మీ బదులిస్తూ.. ‘కోడికి బాధ లేదని మీకు ఎలా తెలుసు? సంప్రదాయం అయితే మనుషులు పోరాటాలు ఎందుకు పెట్టడం లేదు. గ్లాడియేటర్ పోరాటాలు కూడా సంప్రదాయమే కదా? దానిని కూడా అనుసరించి మనుషులు కూడా చనిపోయే వరకు పోరాడాలి’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Sad to see people taking pride in such bullshit
Having a harmless festival doesn’t take much pic.twitter.com/scoLzi44Sk— rashmi gautam (@rashmigautam27) January 15, 2023
