×
Ad

Rashmika Mandanna : జపాన్‌లో రష్మిక ఫాలోయింగ్ మాములుగా లేదుగా.. పోస్టర్స్‌తో ఫ్యాన్స్ సందడి..

నేషనల్ క్రష్ నుంచి పాన్ ఇండియా హీరోయిన్ లెవెల్ ని వెళ్లిన రష్మిక.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని కూడా అనిపించుకుంటున్నారు.

  • Published On : March 1, 2024 / 11:15 AM IST

Rashmika Mandanna craze in japan tokyo fans welcoming video gone viral

Rashmika Mandanna : ఇండియన్ బిగ్గెస్ట్ హీరో అమితాబ్ బచ్చన్ తోనే నేషనల్ క్రష్ అనిపించుకున్న రష్మిక మందన్న.. సౌత్ టు నార్త్ వరుస హిట్స్ అందుకుంటూ పాన్ ఇండియా హీరోయిన్ అనే ఇమేజ్ ని కూడా సొంతం చేసుకుంది. అయితే తన స్టార్‌డమ్ అక్కడితో ఆగిపోలేదు. నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఎదుగుతూ ముందుకు వెళ్తుంది. జపాన్ బ్రాండ్స్ కి అంబాసడర్ గా వ్యవహరిస్తూ అదుర్స్ అనిపిస్తున్నారు.

పుష్ప వంటి సినిమాలతో రష్మికకు జపాన్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో జపాన్ కి చెందిన టాప్ ఫ్యాషన్ బ్రాండ్ ‘Onitsuka Tiger’కి రష్మికని తమ బ్రాండ్స్ అంబాసడర్ గా గత ఏడాదే నియమించుకుంది. ఇక ఈ బ్రాండ్ కి సంబంధించిన పలు ప్రమోషన్ ఫ్యాషన్ ఈవెంట్స్ లో రష్మిక పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల ఇటలీలో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్ కి రష్మిక గెస్ట్ గా వెళ్లారు.

Also read : Allu Sneha Reddy : ఫిట్నెస్ వర్కౌట్ పాఠాలు చెబుతున్న అల్లు అర్జున్ భార్య.. వీడియో వైరల్

తాజాగా ఈమె జపాన్ లో జరిగే మరో ఈవెంట్ కి వెళ్లినట్లు సమాచారం. నిన్న హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి జపాన్ చేరుకున్న రష్మికకు అక్కడి అభిమానులు గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. అది చూసిన రష్మిక సైతం ఎమోషనల్ అయ్యారు. జపాన్ రాజధాని టోక్యోలో రష్మిక ఫ్యాన్స్ ఆమె పోస్టర్స్ పట్టుకొని స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక ఇది చూసిన రష్మిక ఫ్యాన్స్.. నేషనల్ క్రష్, పాన్ ఇండియా హీరోయిన్ నుంచి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనిపించుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. కాగా రష్మిక ఇలా ఒక పక్క బ్రాండ్ ప్రమోషన్స్ అంటూ విదేశాల్లో తిరుగుతూనే.. మరో పక్క తన సైన్ చేసిన సినిమాల షూటింగ్స్ కి కూడా అటెండ్ అవుతూ ఫుల్ బిజీ లైఫ్ ని చూస్తున్నారు. ప్రెజెంట్ రష్మిక చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు, మూడు రీజినల్ సినిమాలు ఉన్నాయి.