Rashmika Mandanna : గాయపడిన రష్మిక మందన్న.. ఆరు వారాలు రెస్ట్.. ఆందోళనలో అభిమానులు..

తాజాగా రష్మిక మరోసారి గాయపడింది. (Rashmika Mandanna)

  • Updated on- July 31, 2026 / 06:40 PM IST

Rashmika Mandanna

Rashmika Mandanna : ఇటీవలే విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకొని హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ గడుపుతూ మరో పక్క వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంది రష్మిక మందన్న. ఇటీవలే రణబాలి, మైసా సినిమాల యాక్షన్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసింది. మైసా యాక్షన్ సీక్వెన్స్ లో కొద్దిగా గాయపడినట్టు ఇటీవల రష్మిక ఫొటోలు బయటకు వచ్చాయి. తాజాగా రష్మిక మరోసారి గాయపడింది.

ఓ సినిమాకు సంబంధించి పాట షూటింగ్ చేస్తుండగా నడుము కింద భాగంలో హిప్ జాయింట్ వద్ద గాయం అయిందని సమాచారం. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారని, ప్రాథమిక చికిత్స చేసి వైద్యుల పర్యవేక్షణలో పెట్టినట్టు తెలుస్తుంది. నడుము కింద భాగంలో బలమయిన గాయం అయిందని, డాక్టర్స్ కనీసం ఆరు వారాలు రెస్ట్ తీసుకోవాలని సూచించారట. డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం.. రశ్మిక హిప్ ఏరియాలో పూర్తిగా టెండన్ డిటాచ్ మెంట్ అయ్యింది. ఆమె గాయం వైద్యులను సైతం షాక్ కు గురి చేసింది. తీవ్రంగా సాధన చేసే క్రీడాకారుల్లో మాత్రమే ఇలాంటి గాయాలు అవుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. టెండన్ తిరిగి బలపడేందుకు రీహాబిలిటేషన్ కూడా అవసరం అని వైద్యులు తెలిపారు.  దీంతో రష్మిక ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. రష్మిక గాయంతో ప్రస్తుతం ఆమె సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి.

Also Read : Objection My Lord Review : ‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’ వెబ్ సిరీస్ రివ్యూ.. శ్రీకాంత్ నటించిన కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉంది?

గతంలో కూడా రష్మిక కాలుకి గాయం అయి, ఆపరేషన్ జరిగి కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకుంది. అప్పుడు కాలుకు కట్టు కట్టిన ఫోటో కూడా షేర్ చేసింది. మరి ఈ గాయం పై రష్మిక కానీ, విజయ్ కానీ తమ సోషల్ మీడియాలో అభిమానుల కోసం ఏదైనా పోస్ట్ పెడతారేమో చూడాలి.