Rashmika Mandanna : బేబీ సినిమా చూసి ఏడ్చేశాను.. బేబీ డైరెక్టర్ పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు..
రష్మిక మాట్లాడుతూ బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గురించి కూడా మాట్లాడింది.
- Saketh U
- Published On : May 28, 2024 / 10:08 AM IST
Rashmika Mandanna Interesting Comments on Anand Deverakonda Baby Movie and Director Sai Rajesh
Rashmika Mandanna : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇప్పుడు ‘గం గం గణేశా'(Gam Gam Ganesha) సినిమాతో మే 31న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా నిన్న రాత్రి గం గం గణేశా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా రష్మిక మందన్న గెస్ట్ గా వచ్చింది. రష్మిక రెండోసారి ఆనంద్ సినిమా ప్రమోషన్స్ కోసం రావడంతో ఈ ఈవెంట్ బాగా వైరల్ అయింది.
Also Read : Rashmika – Anand : నీ యబ్బ.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలిరా.. రష్మికని ఆడేసుకున్న విజయ్ తమ్ముడు..
అయితే ఆనంద్‌కి బేబీ లాంటి బిగ్గెస్ట్ హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ సాయి రాజేష్ కూడా ఈ ఈవెంట్ కి వచ్చాడు. రష్మిక మాట్లాడుతూ సాయి రాజేష్ గురించి కూడా మాట్లాడింది. రష్మిక మాట్లాడుతూ.. నేను సాయి రాజేష్ గారి బేబీ సినిమా చూసాను. ఆ సినిమా చూసాక మీతో సినిమా చేయాలని అనుకున్నాను. అలాంటి సినిమా చేయడం అంత ఈజీ కాదు. మీ హార్డ్ వర్క్, డెడికేషన్ నాకు తెలుసు. మొదటిసారి బేబీ సినిమా చూసినప్పుడు నేను ఏడ్చేసాను. ఒక నటిగా ఆ సినిమా చూసాక సాయి రాజేష్ గారితో ఒక సినిమా చేయాలి, ఒక మెంటల్ క్యారెక్టర్ చేయాలనిపించింది మీ డైరెక్షన్ లో అని చెప్పింది. దీంతో రష్మిక వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
#SaiRajesh గారితో Work చెయ్యాలి.
ఒక Mental Character చెయ్యాలి!
– #RashmikaMandanna pic.twitter.com/SHSblTY4oX
— Gulte (@GulteOfficial) May 27, 2024
మరి ఫ్యూచర్ లో సాయి రాజేష్ దర్శకత్వంలో రష్మిక మందన్న నిజంగానే సినిమా చేస్తుందా లేదా చూడాలి. ప్రస్తుతం రష్మిక తెలుగు, హిందీలో భారీ సినిమాలతో బిజీగా ఉంది.
