Rashmika Mandanna : విజయ్ దేవరకొండకి లిప్ లాక్ ఇవ్వడం వల్ల.. రాత్రిపూట లేచి చాలా సార్లు ఏడ్చాను..
రష్మిక మాట్లాడుతూ.. ''డియర్ కామ్రేడ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ రోజులని నేను ఎప్పటికి మర్చిపోలేను. విజయ్ దేవరకొండకి ఆ సినిమాలో లిప్ కిస్ ఇచ్చాను. ఆ లిప్ కిస్ సీన్స్ పై...........
- Saketh U
- Published On : October 4, 2022 / 04:33 PM IST
Rashmika Mandanna reacts on trolls at Dear Comrade Movie time
Rashmika Mandanna : పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది రష్మిక. త్వరలో అమితాబ్ తో కలిసి నటించిన గుడ్ బై సినిమా రిలీజ్ కానుంది. దీంతో రష్మిక బాలీవుడ్ లో గుడ్ బై సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత జరిగిన కొన్ని సంఘటనలని తలుచుకొని ఎమోషనల్ అయింది.
విజయ్ దేవరకొండ , రష్మిక మంచి ఫ్రెండ్స్. వీరిద్దరూ గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించారు. ఈ రెండు సినిమాల్లోనూ వీరిద్దరి మధ్య లిప్ కిస్ సీన్స్ ఉంటాయి. అయితే డియర్ కామ్రేడ్ లో అవి మరింత ఎక్కువగా ఉంటాయి. దీంతో డియర్ కామ్రేడ్ సినిమా రిలీజ్ అయ్యాక ఈ లిప్ కిస్ సీన్స్ వల్ల రష్మికని చాలా మంది ట్రోల్ చేశారు. ఆ విషయం గురించి రష్మిక తాజాగా స్పందించింది.
BiggBoss 6 Day 29 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే.. భార్య భర్తలని విడదీసిన బిగ్‌బాస్
రష్మిక మాట్లాడుతూ.. ”డియర్ కామ్రేడ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ రోజులని నేను ఎప్పటికి మర్చిపోలేను. విజయ్ దేవరకొండకి ఆ సినిమాలో లిప్ కిస్ ఇచ్చాను. ఆ లిప్ కిస్ సీన్స్ పై చాలా మంది నను ట్రోల్ చేశారు, విమర్శించారు. నేను మామూలుగానే సెన్సిటివ్. ఆ విమర్శలని తట్టుకోలేకపోయాను. చాలా ఒత్తిడికి గురయ్యాను. విజయ్ కి లిప్ కిస్ ఇచ్చినందుకు వచ్చిన విమర్శలు గుర్తొచ్చి రాత్రిపూట లేచి ఏడ్చేదాన్ని. ఆ సంఘటనల నుండి బయటపడటానికి చాలానే సమయం పట్టింది. ఆ సమయంలో విజయ్ తో పాటు, చాలా మంది నాకు సపోర్ట్ చేశారు. ఫోన్ చేసి నాకు ధైర్యం చెప్పారు” అని తెలిపింది.
