Rashmika Mandanna : జపాన్ ‘యానిమే’ అవార్డ్స్ ఈవెంట్లో.. రష్మిక స్పీచ్ విన్నారా?

జపాన్ క్రంచిరోల్ యానిమే అవార్డ్స్ లో రష్మికను ఓ అవార్డుని ప్రజెంట్ చేయడానికి పిలిచారు. దీంతో స్టేజిపై రష్మిక మాట్లాడుతూ..

  • Published On : March 3, 2024 / 12:03 PM IST

Rashmika Mandanna Speech in Crunchyroll Anime Awards at Japan goes Viral

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల జపాన్(Japan) వెళ్లిన సంగతి తెలిసిందే. జపాన్ లోని క్రంచిరోల్ యానిమే అవార్డ్స్ ఈవెంట్ కి రష్మిక గెస్ట్ గా వెళ్ళింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రష్మిక జపాన్ నుంచి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. జపాన్ లో తనకి మంచి స్వాగతం లభించిందని సంతోషిస్తూ పోస్టులు చేసింది. జపాన్ లో రష్మిక క్రేజ్ చూసి ఇక్కడి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు.

ఈ క్రంచిరోల్ యానిమే అవార్డ్స్ లో రష్మికను ఓ అవార్డుని ప్రజెంట్ చేయడానికి పిలిచారు. దీంతో స్టేజిపై రష్మిక మాట్లాడుతూ.. నేను యానిమేకి చాలా పెద్ద ఫ్యాన్. ఇండియాలో కూడా యానిమేకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మా సినిమాలకు, యానిమేకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. విజువల్ గా కూడా చాలా బాగుంటాయి. ఇవి సృస్టిస్తున్నందుకు మన డైరెక్టర్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. మనం ఊహించలేని విధంగా క్యారెక్టర్లు, కథలు, సినిమాలు సృష్టించి మనకు అందిస్తున్నారు. అవి మనల్ని ఎంతగానో ప్రేరేపిస్తాయి అని తెలిపింది. అనంతరం బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్ అవార్డుని అనౌన్స్ చేసింది రష్మిక.

Also Read : Ram Charan – Dhoni : ఒకే ఫ్రేమ్‌లో మహేంద్ర సింగ్ ధోని, రామ్ చరణ్.. వైరల్ అవుతున్న వీడియో..

జపాన్ లో రష్మిక స్పీచ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. యానిమే అభిమానులు కూడా రష్మికని అభినందిస్తున్నారు. జపాన్ లో రష్మికకు వచ్చిన క్రేజ్ చూసి మొత్తానికి నేషనల్ క్రష్ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రష్ అవుతుంది అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.