Raveena Tandon: బ్రదర్‌తో సంబంధం అంటగట్టారు.. గత జ్ఞాపకాలను తలచుకున్న రవీనా!
హీరోయిన్స్ మీద గాసిప్స్ రావడం సాధారణం విషయం. ప్రస్తుత కాలంలో అయితే అసలు డేటింగ్, రిలేషన్ అనేది నటీనటులకు చాలా కామన్ అయిపోయింది. అందరినీ అదే జాబితాలో చేర్చలేం కానీ..
- Naresh Mannam
- Published On : January 5, 2022 / 05:07 PM IST
Raveena Tandon
Raveena Tandon: హీరోయిన్స్ మీద గాసిప్స్ రావడం సాధారణం విషయం. ప్రస్తుత కాలంలో అయితే అసలు డేటింగ్, రిలేషన్ అనేది నటీనటులకు చాలా కామన్ అయిపోయింది. అందరినీ అదే జాబితాలో చేర్చలేం కానీ ఎక్కువ శాతం నచ్చితేనే పెళ్లి అప్పటి వరకు డేటింగ్ అంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే.. కలిసి షికార్లు చేస్తున్న జంటలు ఎన్నో కనిపిస్తున్నాయి. అయితే.. గతంలో ఇప్పటిలా పరిస్థితి లేదు. కానీ.. మీడియా, మ్యాగజైన్లలో నటీనటుల ప్రేమ వ్యవహారం గురించి కథలు కథలుగా రాసేవారు.
RRR Movie : ఆర్ఆర్ఆర్‌కు కొత్త చిక్కు.. సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని హైకోర్టులో పిల్
అలానే ఒకసారి తెలుగులో కూడా నటించిన బాలీవుడ్ నటి రవీనా టాండన్ ప్రేమ గురించి కూడా చాలాసార్లు రాశారు. రవీనా వాళ్ళతో రిలేషన్ లో ఉందని.. ప్రేమలో పడిందంటూ రాసేవాళ్ళు. అయితే ఓ మ్యాగజైన్ ఒకసారి తన సోదరుడితో కూడా సంబంధం ఉన్నట్లుగా రాశారట. రవీనాను డ్రాప్ చేసేందుకు ఒకసారి తన సోదరుడు రాగా.. ఆ ఫోటోలతో సహా ఓ మ్యాగజైన్ అప్పట్లో రవీనా బాయ్ ఫ్రెండ్ ను మేము కనిపెట్టాం అంటూ కవర్ పేజీతో సహా బిగ్ స్టోరీ రాసుకొచ్చిందట. ఆ సంఘటన తనను చాలా కలచి వేసిందని రవీనా తాజాగా చెప్పుకొచ్చింది.
Young Hero’s: మారుతున్న ట్రెండ్.. స్టార్ హీరోల సినిమాలలో యంగ్ హీరోలు!
ఈ మధ్యనే ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడిన రవీనా.. పుకార్ల వలన నేను అనేక నిద్ర లేని రాత్రులు గడపడం నాకు గుర్తుందని.. నిద్ర పోవడం కోసం ఏడ్చేదాన్నని.. ప్రతి రోజు భయపడుతూ బతికాను. ఎప్పుడూ ఏ పుకారు నా మీద వస్తుందో అని.. ఆ పుకార్లు నన్ను పూర్తిగా నాశనం చేశాయి. నా విశ్వసనీయత, నా ప్రతిష్ఠ, నా తల్లిదండ్రుల మనసులను ముక్కలు చేశాయి. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే ఇదంతా దేని గురించి అని. అసలు ఎలా చెప్తారు మీరు. ఎలా ధృవీకరీస్తారు.’ అని బాధను చెప్పుకొచ్చింది. అప్పట్లో జర్నలిస్టుల దయతో నటులు ఉండేవారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
