Eagle : సంక్రాంతి నుంచి ఈగల్ తప్పుకుంటుందా..? పుట్టినరోజు కోసం చూస్తున్నారా..?

సంక్రాంతి నుంచి రవితేజ ఈగల్ తప్పుకుంటుందా..? కానీ రవితేజ సినిమానే పోస్టుపోన్ ఎందుకంటే..

Ravi Teja Anupama Kavya Thapar Eagle movie will be postponed from sankranti

Eagle : మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న యాక్షన్ స్టైలిష్ థ్రిల్లర్ మూవీ ‘ఈగల్’. ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 13న రిలీజ్ అయ్యేందుకు వరుస ప్రమోషన్స్ జరుపుకుంటూ వస్తుంది. మరో తొమ్మిది రోజులు ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది అనుకున్న ఈ చిత్రం ఇప్పుడు వాయిదా పడుతుందట.

ఈ సంక్రాంతికి ఈ సినిమాతో పాటు మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, తేజ సజ్జ సినిమాలు ఉన్నాయి. ఈ చిత్రాలు అన్ని రెండు వ్యవధిలోనే రిలీజ్ కాబోతున్నాయి. దీంతో పలు సినిమాలకు స్క్రీన్స్ దొరకడం కష్టంగా మారింది. దీంతో ఎవరో ఒకరి తప్పుకుంటే అందరికి మంచిదని.. ఇటీవల దిల్ రాజు ఆయా సినిమాల నిర్మాతలతో ఓ సమావేశం కూడా నిర్వహించారు. దీంతో అన్ని సినిమాల మంచి కోసం రవితేజ ‘ఈగల్’ సినిమాని వెనక్కి తీసుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది.

Also read : Hanuman : హనుమాన్ కోసం చిరంజీవి రాకుంటే ఇంకెవరు వస్తారు.. మెగా ఉత్సవ్‌ వివరాలు ఇవే..

ఇక ఈ చిత్రాన్ని జనవరి 26కి పోస్టుపోన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే రవితేజ సినిమానే పోస్టుపోన్ ఎందుకంటే.. ఈ నెలలో రవితేజ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 26న మాస్ మహారాజ్ పుట్టినరోజు. ఆ రోజు కూడా వీకెండ్ లోనే వచ్చింది. దీంతో అటు సినిమా రిలీజ్ సెలబ్రేషన్స్, ఇటు రవితేజ బర్త్ డే సెలబ్రేషన్స్ ఒకేరోజు కలిసి వస్తాయని భావించినట్లు తెలుస్తుంది.

అయితే ఈ పోస్టుపోన్ న్యూస్ గురించి మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఏ రోజుకి వాయిదా వేస్తారో చూడాలి. కాగా ఈ సినిమాలో కావ్య తపర్ హీరోయిన్ గా నటిస్తుంటే అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి డవ్ జంద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు