Ravi Teja : బాధ పడతారు ఏమో గాని బయటపడరు.. రవితేజ!
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న మాస్ మసాలా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఇక ఈ ఫంక్షన్ లో రవితేజ.. చిరంజీవి మనస్తత్వం ఏంటి అనేది అభిమానులతో పంచుకున్నాడు.
- gum 95921
- Published On : January 9, 2023 / 07:28 AM IST
Ravi Teja comments on chiranjeevi
Ravi Teja : మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న మాస్ మసాలా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కె బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరు అండ్ రవితేజ ఇద్దరు హాజరయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఈ ఈవెంట్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఇక ఈ ఫంక్షన్ లో రవితేజ.. చిరంజీవి మనస్తత్వం ఏంటి అనేది అభిమానులతో పంచుకున్నాడు.
Ravi Teja : ‘విజేత’ సినిమా ఫంక్షన్ సమయంలో అనుకున్నది నెరవేర్చుకున్నా.. రవితేజ!
ఈ కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ.. “నేను చెప్పాలి అనుకున్నదే బాబీ చెప్పేశాడు. ఎదుట వ్యక్తిని ఏమి అనరు. ఎవరన్నా ఏమన్నా అంటే భరిస్తారు. బాధ పడతారు ఏమో గాని అసలు బయటపడరు ఆయన. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం అది. పోనిలే పాపం అంటూ అందర్నీ వదిలేస్తారు. నాకు తెలిసి, ఇన్నాళ్ల నా పరిచయంలో ఆయన ఒకళ్ళు గురించి నెగటివ్ గా మాట్లాడడం నేను విన లేదు. అంత మంచి వ్యక్తి చిరంజీవి గారు. ఐ లవ్ యు అన్నయ్య” అంటూ చిరంజీవిని ప్రశంసించాడు.
దర్శకుడు బాబీ గురించి మాట్లాడుతూ.. ‘బాబీ నాకు బలుపు సినిమా సమయంలో పరిచయమయ్యాడు. కథ చెబుతా అన్నాడు, పవర్ సినిమా చేసుకున్నాడు. అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఇతని కెరీర్ ఈ మరో లెవెల్ కి వెళ్ళిపోతాడు’ అంటూ వెల్లడించాడు. సినిమా చాలా బాగా వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టబోతున్నాము అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందు రాబోతుంది.
