Raviteja
Raviteja : ఇటీవల సంక్రాంతికి చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి భారీ విజయం సాధించారు. ఫ్లాప్స్ లో ఉన్న రవితేజ ఈ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో వచ్చి యావరేజ్ గా నిలిచారు. సంక్రాంతికి రిలీజయిన అన్ని సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసాయి. థియేటర్లో హిట్ అయి ఓటీటీలో కూడా దూసుకుపోతున్నాయి.(Raviteja)
కానీ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఇంకా ఓటీటీలోకి రాకపోవడం గమనార్హం. సూపర్ హిట్ అయిన సినిమాలే నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంటే యావరేజ్ గా నిలిచిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఇంకా రాలేదేంటి అని ఆశ్చర్యపోతున్నారు.
Also Read : ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు – కనపడుటలేదు’ ట్రైలర్ రిలీజ్.. కొత్త వెబ్ సిరీస్ ఎందులో? ఎప్పట్నించి?
రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఓటీటీ రైట్స్ జీ5 కొనుక్కుంది. చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కూడా జీ5 ఓటీటీలో ఇటీవలే ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాకు ఓటీటీలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందట. ఇప్పటికే 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటేసి మరీ దూసుకెళ్లిపోతుంది. ఈ సినిమా ఇంత బాగా నడుస్తున్న టైంలో రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కూడా రిలీజ్ చేసి దీన్ని ఎందుకు ఎఫెక్ట్ చేయడం అని ఆలోచిస్తున్నారట జీ5 టీమ్.
ఒకవేళ రిలీజ్ చేస్తే రెండు సినిమాల వ్యూయర్ షిప్ తగ్గుతుందని అనుకుంటున్నారు. అందుకే చిరంజీవి సినిమా దూసుకుపోతుంది కాబట్టి కాస్త గ్యాప్ ఇచ్చి రవితేజ సినిమా స్ట్రీమింగ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ చేస్తారని టాక్ వచ్చినా ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అనే క్లారిటీ లేదు.
Also Read : Krishnam Raju : అర్ధరాత్రి 3 గంటలకు స్మశానంలో.. కృష్ణంరాజు – అలీ కలిసి ఏం చేసారో తెలుసా?