Mr Bachchan : రవితేజ హరీష్ శంకర్ సినిమా కూడా రీమేకేనా? బాలీవుడ్ సినిమా రీమేక్‌తో మాస్ మహారాజ..

గతంలోనే హరీష్ శంకర్ రవితేజతో ఓ బాలీవుడ్ సినిమాని రీమేక్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి.

Mr Bachchan : రవితేజ హరీష్ శంకర్ సినిమా కూడా రీమేకేనా? బాలీవుడ్ సినిమా రీమేక్‌తో మాస్ మహారాజ..

Raviteja Harish Shankar Mr Bachchan Movie Remake from Bollywood Ajay Devgn Movie

Mr Bachchan Movie : పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లేట్ అవుతుండటంతో డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) ఆ సినిమా పక్కన పెట్టేసి రవితేజ(Raviteja)తో మిస్టర్ బచ్చన్ సినిమా ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ అనే బాలీవుడ్ భామ హీరోయిన్ గా నటిస్తుంది. నిన్నే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోగా త్వరలో షూటింగ్ కి వెళ్లనుంది.

అయితే ఈ సినిమా రీమేక్ అని తెలుస్తుంది. గతంలోనే హరీష్ శంకర్ రవితేజతో ఓ బాలీవుడ్ సినిమాని రీమేక్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ సినిమా బాలీవుడ్ లో అజయ్ దేవగన్, ఇలియానా నటించిన రైడ్ సినిమాకు రీమేక్ గా రాబోతుంది. 2018లో రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో 1980ల్లో జరిగిన ఓ నిజ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ లో రైడ్ సినిమా మంచి విజయం సాధించింది.

ఇప్పుడు ఈ సినిమాకు హరీష్ శంకర్ మార్క్ కమర్షియల్ అంశాలు జోడించి అదే 1980 కథలా తీయబోతున్నట్టు తెలుస్తుంది. గతంలో హరీష్ శంకర్ తీసిన గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ సినిమాలు కూడా రీమేక్ సినిమాలే. వీటితో మంచి విజయం సాధించాడు. ఇప్పుడు మాస్ మహారాజ రవితేజతో మరో రీమేక్ తీసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ఇక బాలీవుడ్ సినిమా రైడ్ కథేంటంటే.. ఓ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఓ వ్యాపారవేత్త, ఎంపీ ఇంట్లో రైడ్ కి వెళ్తే అక్కడ బోలెడంత అక్రమ సంపాదన దొరుకుతుంది. దీని నుంచి బయటపడటానికి ఆ ఎంపీ PM వరకు వెళ్తాడు అయినా ఆ ఆఫీసర్ వెనక్కి తగ్గకపోవడంతో అతనిపై అటాక్ చేయిస్తాడు. దాన్ని హీరో ఎలా ఎదుర్కున్నాడు అనేదే కథాంశం. ఇప్పుడు ఇదే కథని హరీష్ శంకర్ ఇక్కడి నేటివిటీకి మార్చి, కమర్షియల్ జోడించి తీయనున్నారు.

Also Read : Naga Vamsi : గుంటూరు కారంపై వచ్చే వార్తలన్నీ ఫేక్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

అజయ్ దేవగన్ రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా పోస్టర్ పోస్ట్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పగా రవితేజ దాన్ని షేర్ చేసి థ్యాంక్ యూ చెప్పి సినిమా జర్నీ రైడింగ్ తో మొదలవుతుందని పోస్ట్ చేసాడు.