Naga Vamsi : గుంటూరు కారంపై వచ్చే వార్తలన్నీ ఫేక్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

గత కొన్ని రోజులుగా గుంటూరు కారం సినిమాపై సినిమా షూటింగ్ అవ్వలేదు, రిలీజ్ చేస్తారా, మళ్ళీ వాయిదా పడుతుంది అని పలు వార్తలు వస్తున్నాయి.

Naga Vamsi : గుంటూరు కారంపై వచ్చే వార్తలన్నీ ఫేక్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

Producer Naga Vamsi Gives Clarity on Guntur Kaaram Movie News

Updated On : December 18, 2023 / 9:52 AM IST

Naga Vamsi : మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మసాలా మూవీ గుంటూరు కారం. శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్, రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. మరో పక్క నెల రోజుల్లో రిలీజ్ పెట్టుకొని ఈ సినిమా షూటింగ్ ఇంకా అవ్వలేదని సమాచారం.

గత కొన్ని రోజులుగా గుంటూరు కారం సినిమాపై సినిమా షూటింగ్ అవ్వలేదు, రిలీజ్ చేస్తారా, మళ్ళీ వాయిదా పడుతుంది అని పలు వార్తలు వస్తున్నాయి. అలాగే సాంగ్స్ బాగోలేవంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇలా గుంటూరు కారం సినిమా ట్రెండింగ్ లో ఉంది. దీంతో నిర్మాత నాగవంశీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. గుంటూరు కారం సినిమాపై ఎలాంటి నెగిటివ్ వచ్చినా నిర్మాత నాగవంశీ సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు.

Also Read : Pallavi Prashanth : బిగ్‌బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్.. ప్రైజ్ మనీ ఎంత? ఇంకేమేమి గెలుచుకున్నాడు?

తాజాగా నాగవంశీ తన ట్విట్టర్ లో.. డియర్ సూపర్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ గుంటూరు కారం సినిమాలు 4 పాటలు, ఒక బిట్ సాంగ్ ఉన్నాయి. ఇప్పటికే 3 సాంగ్స్, ఆ బిట్ సాంగ్ షూట్ అయిపోయింది. మిగిలిన సాంగ్ డిసెంబర్ 21 నుంచి షూట్ చేయబోతున్నాం. ఇటీవల వచ్చిన న్యూస్ అన్ని ఫేక్, గాసిప్స్ మాత్రమే. కొంతమంది వాళ్ళ వ్యూస్ కోసం ఇలాంటి ఫేక్ వార్తలు రాస్తారు. ఎలా రాస్తే మీరు రియాక్ట్ అవుతారో వాళ్లకి తెలుసు. మేము సైలెంట్ గా ఉన్నంత మాత్రాన వాళ్ళు చెప్పే వార్తలు నిజం కాదు అని పోస్ట్ చేశారు. దీంతో నాగవంశీ ట్వీట్ వైరల్ గా మారింది. ఇక గుంటూరు కారం సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది.