Pallavi Prashanth : బిగ్‌బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్.. ప్రైజ్ మనీ ఎంత? ఇంకేమేమి గెలుచుకున్నాడు?
మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు.

Bigg Boss 7 Telugu Winner Pallavi Prashanth Winning Amount and Remuneration full Details
Pallavi Prashanth : బిగ్‌బాస్ సీజన్ 7 పూర్తయింది. 15 వారాలుగా సాగిన ఈ బిగ్‌బాస్ నిన్న ఆదివారం రాత్రి పూర్తయింది. 14 మందితో మొదలైన బిగ్‌బాస్ కొంతమంది ఎలిమినేట్ అయిన తర్వాత మరో అయిదుగురిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొచ్చారు. ఒక్కో వారం ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయగా ఫైనల్ కి ఆరుగురిని మిగిల్చారు. అర్జున్, ప్రియాంక జైన్, యావర్, శివాజీ, అమర్ దీప్, ప్రశాంత్ లు ఫైనల్ కి వెళ్లారు.
ఇక ఫైనల్ లో ఆరో ప్లేస్ లో అంబటి అర్జున్ నిలవగా, ఐదో ప్లేస్ లో ప్రియాంక జైన్, నాలుగో ప్లేస్ లో యావర్, మూడో ప్లేస్ లో శివాజీ, రెండో ప్లేస్ లో అమర్ దీప్ నిలవగా విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ని ప్రకటించారు. ముందు నుంచి రైతు బిడ్డ అని పొలాల్లో వీడియోలు తీసుకుంటూ సింపతీతో ఫాలోవర్స్ తెచ్చుకున్న ప్రశాంత్ నన్ను బిగ్ బాస్ కి తీసుకెళ్లండి అని ఓ సంవత్సరం పాటు వీడియోలు చేసి మొత్తానికి హౌస్ లో చోటు సంపాదించాడు. ఇక హౌస్ లో కూడా రైతు బిడ్డ, రైతు బాధలు అని సింపతీతో పాపులర్ అయి విన్నింగ్ వరకు వచ్చాడు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు.
Also Read : Bigg Boss 7 Final : బిగ్‌బాస్ ఫినాలే ప్రోమో చూశారా? రవితేజ గెస్ట్‌గా.. అమర్ దీప్‌కి నాగ్ బంపర్ ఆఫర్..
బిగ్‌బాస్ విజేతకు 50 లక్షలు అని ప్రకటించినా దాంట్లో 15 లక్షలు ఓ కంటెస్టెంట్ ని బయటకి పంపడానికి తీశారు. ఆ డబ్బులు యావర్ తీసుకొని వెళ్ళిపోయాడు. దీంతో విన్నింగ్ అమౌంట్ 35 లక్షలు అందుకున్నాడు ప్రశాంత్. దీంతో పాటు అతని రెమ్యునరేషన్ 15 వారాలకు 15 లక్షలు అని సమాచారం. అలాగే వీటితో పాటు ఓ మారుతి బ్రేజా కార్, ఓ డైమండ్ నెక్లెస్ కూడా గెలుచుకున్నాడు. అయితే మొత్తం బిగ్‌బాస్ నుంచి రెమ్యునరేషన్, ప్రైజ్ మనీ కలిపి ఇతను సంపాదించిన 50 లక్షల్లో దాదాపు 15 లక్షలు ట్యాక్స్ పోతుంది. అంటే చివరికి ప్రశాంత్ చేతికి 35 లక్షలు మిగులుతుంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్స్ లో రీల్స్ చేసుకుంటూ ఇక్కడివరకు వచ్చి బాగానే సంపాదించుకున్నాడు అని అంతా అనుకుంటున్నారు.
View this post on Instagram