Irumudi Censor Review: ‘ఇరుముడి’ సెన్సార్ రివ్యూ.. ఈ సారి రవితేజ పక్కా హిట్..

Irumudi Censor Review: వరుస ఫ్లాప్స్ తో ఉన్న రవితేజకు ఈ సినిమా ఊరట ఇస్తుంది అని అంతా నమ్ముతున్నారు.

  • Updated on- August 19, 2026 / 12:31 PM IST

Ravi Teja Irumudi Censor Review

Irumudi Censor Review: రవితేజ, ప్రియభవాని శంకర్ జంటగా నటించిన సినిమా ఇరుముడి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో డివోషనల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా అనౌన్న్ చేసిన దగ్గర్నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. సినిమాలో రెండు అయ్యప్ప స్వామి పాటలు ఉండటం, అందులో ఒకటి ఫేమస్ మల్లెపూల పల్లకి సాంగ్ కావడంతో అయ్యప్ప భక్తులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

వరుస ఫ్లాప్స్ తో ఉన్న రవితేజకు ఈ సినిమా ఊరట ఇస్తుంది అని అంతా నమ్ముతున్నారు. రిలీజ్ కి ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ తో ఇరుముడి ప్రేక్షకులకు సినిమా చూడాలి అనే ఉత్సుకతను పెంచింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో సెన్సార్ రిపోర్ట్ వైరల్ గా మారింది. సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా యాక్షన్ కాస్త ఎక్కువ ఉండటంతో సెన్సార్ యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా నిడివి 2 గంటల 25 నిమిషాలుగా ఫైనల్ చేసారు.

Also Read – Ayesha Khan : నిశ్చితార్థం చేసుకున్న బోల్డ్ భామ అయేషా ఖాన్..? ఫోటోలు వైరల్.. నిజమేనా?

ఈ సినిమాలో అరటిపళ్ళ బిజినెస్ చేస్తూ, మందు అలవాటు ఉన్న హీరో కూతురు కోసం అయ్యప్ప మాల వేసి 41 రోజులు నిష్టగా ఉంటాడు. సాఫీగా సాగిపోతున్న హీరో జీవితంలోకి ఓ సమస్య వస్తుంది. తన కూతురు చదివే స్కూల్ లో ఆడ పిల్లలు చనిపోవడం, తన కూతురుకు కూడా సమస్య ఎదురవడంతో తిరగబడతాడు. కానీ ఎప్పట్లాగే అయ్యప్ప మాల వేసిన తర్వాత శత్రువులు హీరో మీదకు వస్తే ఏం చేసాడు? అతని జీవితం ఎలా మారింది? అక్కడ ఆడ పిల్లలకు వచ్చిన సమస్య ఏంటి.. అనే కథాంశంతో సస్పెన్స్ డివోషనల్ థ్రిల్లర్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమా సాగిందని సమాచారం.

ఫస్ట్ హాఫ్ చక్కగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా, తండ్రి కూతుళ్ళ అనుబంధంతో సాఫీగా సాగిపోతుంది. ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా అదిరిపోతుందట. చివరి 40 నిముషాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయట. యాక్షన్ సీక్వెన్స్ మంచి హై ఫీల్ ఇస్తాయట. ఇక అయ్యేప్ప స్వామి దీక్ష, రెండు పాటలు మంచి ఆధ్యాత్మిక వైబ్ ఇస్తాయని అంటున్నారు. రవితేజ, చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర ఇద్దరూ తమ పర్ఫార్మెన్స్ లతో అదరగొట్టేశారంట. వీరిద్దరి సీన్స్ సినిమాకు హైలెట్ అవుతాయని చెప్తున్నారు. ఇక మల్లెపూల పల్లకి సాంగ్ కి అయితే థియేటర్స్ ఊగిపోవడం ఖాయం అంటున్నారు. మొత్తానికి చాన్నాళ్ల తర్వాహ రవితేజ హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు సెన్సార్ సభ్యులు.

Also See – Radhika Pandit : టాక్సిక్ హీరో యశ్ భార్య.. రాధికా పండిట్ లేటెస్ట్ ఫొటోలు చూశారా..?