Irumudi : రవితేజ ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎన్నికోట్లు కలెక్ట్ చేయాలి..?
సినిమా మీద హైప్ భారీగానే ఉన్నా రవితేజ గత సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమాకు థియేటరికల్ బిజినెస్ తక్కువగానే జరిగింది. (Irumudi)
Irumudi
Irumudi : రవితేజ, ప్రియభవాని శంకర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘ఇరుముడి’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో డివోషనల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మరింత హైప్ నెలకొంది. ఇరుముడి సినిమా రేపే ఆగస్టు 21న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
అయితే సినిమా మీద హైప్ భారీగానే ఉన్నా రవితేజ గత సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమాకు థియేటరికల్ బిజినెస్ తక్కువగానే జరిగింది.
Also Read : Irumudi Censor Review: ‘ఇరుముడి’ సెన్సార్ రివ్యూ.. ఈ సారి రవితేజ పక్కా హిట్..
ఇరుముడి సినిమా థియేటరికల్ బిజినెస్ డీటెయిల్స్..
నైజాం – 7 కోట్లు
ఆంద్ర – 8 కోట్లు
సీడెడ్ – 2.5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2 కోట్లు
ఓవర్సీస్ – 2 కోట్లకు అమ్ముడయినట్టు సమాచారం.
ఇరుముడి సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21.5 కోట్లకు థియేటరికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 45 కోట్లు గ్రాస్ వసూలు చేయాలి. 50 కోట్లు గ్రాస్ వసూలు చేస్తే ఈ సినిమా హిట్ అయినట్టే. ఈ సినిమాకు ఉన్న హైప్, ఈ వారం పెద్ద సినిమాలు ఏమి లేకపోవడం కలిసొచ్చి ఈజీగానే 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
Also See : Irumudi Pre Release Event : రవితేజ ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
ఇక ఇరుముడి సినిమాకు ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ అన్ని కలిపి దాదాపు 18 కోట్లకు అమ్ముడయినట్టు సమాచారం.
గమనిక : ఈ సమాచారం అంతర్జాలం, పలు సోషల్ మీడియా అకౌంట్స్, పలు టాలీవుడ్ సంస్థల వ్యక్తుల నుంచి సేకరించరించినది. దీనిని 10 టీవీ ధృవీకరించట్లేదు.
