Tiger Nageswara Rao : పాన్ ఇండియా మార్కెట్‌లోకి గజదొంగ ఎంట్రీ.. టైగర్ నాగేశ్వరరావు టీజర్ రిలీజ్!
స్టూవర్టుపురం గజదొంగ పాత్రల్లో రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' టీజర్ రిలీజ్ అయ్యింది.
- gum 95921
- Published On : August 17, 2023 / 03:11 PM IST
Raviteja pan India movie Tiger Nageswara Rao teaser released
Tiger Nageswara Rao : మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) హీరోగా రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. 19’s కాలంలో స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. కొత్త దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Dhanashree verma : నితిన్ పాటకి క్రికెటర్ చాహల్ భార్య మాస్ డాన్స్ అదుర్స్.. రాను రానంటూనే సిన్నదో!
కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికి ప్రీ లుక్ మరియు ఒక చిన్న పోస్టర్ గ్లింప్స్ మాత్రమే ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీ నుంచి పవర్ ఫుల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి గట్టున పుట్టిన టైగర్ నాగేశ్వరరావు గజదొంగగా మొత్తం దేశాన్ని ఎలా గడగడలాడించాడు ఒక చిన్న టీజర్ తో మేకర్స్ చెప్పేశారు. టీజర్ లోని యాక్షన్ చూస్తుంటే పాన్ ఇండియా మార్కెట్ లో టైగర్ నాగేశ్వరరావు దోపిడీ ఓ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది.
Tollywood : సెప్టెంబర్‌లో పాన్ ఇండియా సినిమా ఫెస్టివల్.. లవ్, మాస్, హారర్, కామెడీ, సైన్స్ ఫిక్షన్..
ఈ సినిమాలో హీరోయిన్స్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మలు నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత హీరోయిన్ రేణూ దేశాయ్ (Renu Desai) ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తూ రీ ఎంట్రీ ఇస్తుంది. అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. తమి సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.
