Tiger Nageswara Rao : మాస్ మహారాజ టైగర్ నాగేశ్వరరావు టీజర్ ఆ రోజే.. పాదం మోపిన రవితేజ..

తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. టైగర్ నాగేశ్వరరావు దండయాత్ర వచ్చేది ఆ రోజే అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

Raviteja Tiger Nageswara Rao Teaser Releasing date announced

Tiger Nageswara Rao : మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతూ చేస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఒక్కప్పుడు స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఇప్పటివరకు కనిపించనంత రా అండ్ రస్టిక్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు మాస్ మహారాజ. కొత్త దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

Rashmika Mandanna : ర‌ష్మిక ‘డిసెంబ‌ర్’ సెంటిమెంట్ వ‌ర్కౌట్ అవుతుందా..?

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ బాగా వైరల్ అయ్యాయి. సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. టైగర్ నాగేశ్వరరావు దండయాత్ర వచ్చేది ఆ రోజే అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ తో ఆగస్టు 17న టైగర్ నాగేశ్వరరావు టీజర్ రిలీజ్ కాబోతుందని సమాచారం. ఈ పోస్టర్ లో పవర్ ఫుల్ గా రవితేజ కాలిని చూపించారు. దీంతో టీజర్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు