×
Ad

Jagannath : రాయలసీమ భరత్ ‘జగన్నాథ్’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..

భరత్ హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా చేస్తున్న ఈ సినిమా తాజాగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తయ్యాయి. (Jagannath)

  • Published On : November 29, 2025 / 05:32 PM IST

Jagannath : భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పీలం పురుషోత్తం నిర్మాణంలో భరత్, సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జగన్నాథ్’. రాయలసీమ భరత్ హీరోగా, నిత్యశ్రీ, ప్రీతి, సారా హీరోయిన్లుగా నటిస్తుండగా అజయ్, బాహుబలి ప్రభాకర్, సత్యప్రకాష్, సమ్మెటగాంధీ, జబర్దస్త్ అప్పారావు, షేకింగ్ శేషు.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read : Tere Ishk Mein Review : ‘తేరే ఇష్క్ మే’ మూవీ రివ్యూ.. ధనుష్ బాలీవుడ్ సినిమా ఎలా ఉంది?

భరత్ హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా చేస్తున్న ఈ సినిమా తాజాగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తయ్యాయి. నేడు ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. జగన్నాథ్ సినిమాని డిసెంబర్ 19న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. యాక్షన్, లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న జగన్నాథ్ సినిమా ట్రైలర్ త్వరలోనే రిలీజ్ కానుంది.