క్రికెట్, బాలీవుడ్ కలయికలో సెలబ్రిటీ కపుల్ కోహ్లీ, అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతోకాలం అనుబంధం తర్వాత ఇద్దరు పెళ్లి పీటలెక్కి ఒకటయ్యారు. అయితే ఈ సెలబ్రిటీ కపుల్‍కి చాలాకాలం తర్వాత కలిసి గడిపే అవకాశం లాక్‌డౌన్ కారణంగా వచ్చింది.
ఎప్పుడు బిజీ షెడ్యూల్‌తో తీరిక లేకుండా గడిపే ఈ జంట కరోనా పుణ్యమా అని ఆనందంగా గడిపుతుండగా.. కొంతమంది స్టూడెంట్స్‌కు జీవితాన్ని ఎలా మలుచుకోవాలనే దానిపై కోహ్లి దంపతులు ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతున్నారు కూడా.
ఈ సందర్భంగా కోహ్లి మాట్లాడుతూ.. ‘ముఖ్యంగా ఓపిక విషయంలో క్రెడిట్ మొత్తం నా భార్యకే దక్కుతుందని, గతంలో తాను చాలా దూకుడుగా ఉండేవాడినని, నిజాయతీగా చెప్పాలంటే అనుష్కతో పరిచయం నాలో చాలా మార్పులకు కారణమైందని’ అన్నారు.
అలాగే కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో రాష్ట్ర జట్టుకు ఎంపిక కాకపోవడంతో చాలా బాధపడ్డానని, రాత్రంతా కూర్చొని ఏడ్చినట్లు కోహ్లీ చెప్పాడు. 2013లో ఒక షాంపో యాడ్‌లో భాగంగా విరాట్, అనుష్కలు ఒకరొకొకరు పరిచయమవగా.. 2017లో పెళ్లి చేసుకున్నారు.