Reba Monica John : తల్లి అయిన హీరోయిన్.. కూతురు పుట్టిందంటూ..

తాజాగా రెబా మోనికా తల్లి అయినట్టు అధికారికంగా ప్రకటించింది. (Reba Monica John)

  • Published on- July 28, 2026 / 07:18 PM IST

Reba Monica John

Reba Monica John : సామజవరగమన, మృత్యుంజయ్, మ్యాడ్ స్క్వేర్.. లాంటి పలు హిట్ సినిమాలతో తెలుగులో మెప్పించిన హీరోయిన్ రెబా మోనికా జాన్ ఇటీవల కొన్ని నెలల క్రితం తను ప్రగ్నెంట్ అయినట్టు అధికారికంగా ప్రకటించింది. తన భర్త జొమాన్ జోసెఫ్ తో కలిసి అప్పుడు బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసి ఈ విషయాన్ని తెలిపింది.

తాజాగా రెబా మోనికా తల్లి అయినట్టు అధికారికంగా ప్రకటించింది. తనకు కూతురు పుట్టిందని తెలిపింది. రెబా మోనికా, తన భర్తతో పాటు కూతురు ఫేస్ కనపడకుండా దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నాకు కూతురు పుట్టింది. జులై 22 సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు పుట్టింది. తన పేరు కియారా జోసెఫ్ అని ప్రకటించింది. దీంతో హీరోయిన్ రెబా మోనికా జాన్ కి శుభాకాంక్షలు తెలిపితున్నారు అభిమానులు, నెటిజన్లు.

Also Read : Hyper Aadi : మీ కష్టం పగవాడికి కూడా రాకుడదు.. నాగబాబుపై ఆది కామెంట్స్.. పాపం బాబు అంత కష్టపడుతున్నారా?