Rebel Star: కన్నుమూసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు.. విషాదంలో టాలీవుడ్!
రెబెల్ స్టార్ అనగానే ఇప్పటి జనరేషన్ కి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తాడు కానీ రియల్ రెబెల్ స్టార్ అంటే కృష్ణంరాజు మాత్రమే. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
- gum 95921
- Published On : September 11, 2022 / 07:07 AM IST
Rebel Star Krishnam Raju has been Died
Rebel Star: రెబల్ స్టార్ అనగానే ఇప్పటి జనరేషన్ కి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తాడు కానీ రియల్ రెబల్ స్టార్ అంటే కృష్ణంరాజు మాత్రమే. ప్రభాస్ కి కృష్ణంరాజు పెద్దనాన్న వరస అవుతారు. 1940 జనవరి 20న జన్మించిన రెబెల్ స్టార్ అసలు పేరు ఉప్పలపాటి కృష్ణంరాజు. 1966లో చిలకాగోరింక సినిమాతో వెండితెరకు పరిచయమైన కృష్ణంరాజు ‘183’కు పైగా చిత్రాల్లో నటించారు.
Krishnam Raju : ప్రభాస్ పిల్లలతో ఆడుకోవాలని ఉంది
ఆయన నటుడిగా మొత్తం 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకోగా, రాజకీయవేత్తగా కూడా సేవలు అందించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి పలు సినిమాలో నటించగా, కృష్ణంరాజు చివరిగా నటించిన చిత్రం ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన.. గచ్చిబౌలి AGI హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున గం.3:25 నిలకు తుది శ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతి వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు హాస్పిటల్ కు చేరుకుంటున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం టాలీవుడ్ కి తీరని లోటు అనే చెప్పాలి.
