Hyderabad Floods: ప్రభాస్ ఒక కోటి 50 లక్షల విరాళం..
- sekhar
- Updated on- October 21, 2020 / 07:17 AM IST
Hyderabad Floods: భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న ప్రజలను ఆదుకోవడానికి భారీ విరాళాలందిస్తూ తెరవెనుక కూడా హీరోలమని నిరూపిస్తున్నారు మన తెలుగు హీరోలు. తెలంగాణ సీఎం సహాయ నిధికి టాలీవుడ్ సినీ ప్రముఖులు వరుసగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా Rebel Star Prabhas తన వంతు సాయమందిస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో ఎన్నో ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సహాయార్ధం రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ సీఎం సహయనిధికి తన వంతు సాయంగా సాయంగా కోటి యాభై లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. కరోనా కష్టసమయంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.4 కోట్లు, సినీ కార్మికుల సహాయార్థం భారీ విరాళమందించి మంచి మనసు చాటుకున్నారు ప్రభాస్..
