Renu Desai : మొన్న వార్నింగ్.. నేడు కంప్లైంట్.. సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన రేణు దేశాయ్..
దీనిపై ఉపేక్షించేది లేదని సైబర్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పింది. (Renu Desai)
- Saketh U
- Published On : March 2, 2026 / 07:57 PM IST
Renu Desai
Renu Desai : సెకండ్ ఇన్నింగ్స్ లో రేణు దేశాయ్ అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల కుక్కల గురించి ప్రెస్ మెట్ పెట్టి మరీ మాట్లాడటంతో రేణు దేశాయ్ వైరల్ గా మారింది. దీంతో పలువురు రేణు దేశాయ్ ని ఆ కుక్కలు నిన్ను కరిస్తే తెలుస్తుంది అంటూ అసభ్యకరమైన పదాలతో, భూతులతో తిట్టారు.
రెండు రోజుల క్రితం దీనిపై రేణు దేశాయ్ ఓ వీడియో షేర్ చేసి.. నా డైవర్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ వింటూనే ఉన్నాను. అన్ని అయిపోయాయి అనుకున్నా కానీ రీసెంట్ గా జనవరిలో కుక్కల కోసం ప్రెస్ మీట్ కొన్ని NGOల తరపున పెట్టాను. ఆ విషయంలో నన్ను ఇష్టమొచ్చినట్టు తిట్టారు. భూతులు కూడా తిట్టారు. పర్సనల్ లైఫ్ కి కూడా వచ్చి తిడుతున్నారు. మాట్లాడలేని పదాలతో తిడుతున్నారు అంటూ ఫైర్ అయింది. దీనిపై ఉపేక్షించేది లేదని సైబర్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పింది.
Also Read : Harish Shankar : నేను తేరి రీమేక్ చేయడం కాదు.. నా గబ్బర్ సింగ్ నుంచే తేరి కాపీ చేసారు..
తాజాగా రేణు దేశాయ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఆఫీస్ కి వెళ్లి.. సోషల్ మీడియాలో తన పోస్టుల కింద అసభ్యకర కామెంట్స్ పెడుతున్నారని, గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పదజాలాలు వాడారు అని, అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది.
