×
Ad

Renu Desai : రేణుదేశాయ్ కాలికి గాయం.. వేలు చితికిపోయిందంటూ పోస్ట్!

రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న రేణుదేశాయ్ కాలికి గాయం అయ్యిందట. మూడు వేళ్ళు చితికిపోయినట్లు..

  • Published On : June 26, 2023 / 09:39 PM IST

Renu Desai leg injured and three fingers are badly squashed

Renu Desai : పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) విడాకులు తరువాత రేణు దేశాయ్ దర్శకురాలిగా, నిర్మాతగా రాణిస్తూ వస్తుంది. ఇటీవలే యాక్టింగ్ కెరీర్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తూ టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. కాగా రేణుదేశాయ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది. తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ, అలాగే పవన్ వారసుడు ‘అకీరా నందన్’ సంబంధించిన పోస్ట్ లు కూడా షేర్ చేసి అభిమానులను ఖుషి చేస్తుంటది.

Pawan Kalyan : ఒక్క చోట కూడా వైసీపీని గెలవనివ్వను, ఏపీని నెంబర్ 1 చేస్తా- పవన్ కల్యాణ్

తాజాగా రేణుదేశాయ్ తన గాయం అయ్యినట్లు ఒక పోస్ట్ వేసింది. రెండురోజులు క్రితం ఆమె కాలుకు గాయం అయ్యినట్లు, మూడు వేళ్ళు చితికిపోయినట్లు చెప్పుకొచ్చింది. ఒక వేలు అయితే బాగా దెబ్బతిన్నట్లు చెప్పుకొచ్చింది. ఆ గాయం అయ్యిన కాలుతో నడుచుకుంటూ సముద్రంలోకి వెళ్లి నిలుచున్న వీడియోని షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన కొందరు ఫాలోయర్స్ ఆమెకు జాగ్రత్త చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

O Saathiya Trailer : పాన్‌ ఇండియా లెవెల్‌లో విజయవాడ అబ్బాయి సినిమా.. ‘ఓ సాథియా’ ట్రైలర్ రిలీజ్!

కాగా రేణుదేశాయ్ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు విషయానికి వస్తే.. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుంది. ఒక్కప్పుడు స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రేణుదేశాయ్ ఒక ముఖ్య పాత్ర చేస్తుంది. పూర్తి రా అండ్ రస్టిక్ గా ఉండబోతున్న ఈ సినిమాలో రేణుదేశాయ్ ఎలా కనిపించబోతుంది అని అందరిలో ఆసక్తి నెలకుంది. కొత్త దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.