RGV First Lover: తన ఫస్ట్ లవర్ని పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..కాలేజీ రోజుల్లో తను ప్రేమించిన అమ్మాయి ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. తన మొదటి లవర్ పేర సత్య అని నెటిజన్లకు తెలిపారు.
- kunduru Vinod
- Updated on- August 25, 2021 / 05:04 PM IST
Rgv First Lover
RGV First Lover: రామ్ గోపాల్ వర్మ.. సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉంటారు. ఎప్పుడు ఎదో ఒక విషయంపై స్పందిస్తూనే ఉంటారు. రూపాయి ఖర్చు లేకుండా తన సినిమాలు ప్రోమోట్ చేసుకుంటారు. సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోస్, ఫొటోస్ షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ యువతి బర్త్ డే సందర్బంగా వర్మచేసిన సందడి రచ్చ రచ్చ అయింది. ఆ యువతికి కేక్ తినిపించడం నుంచి ఆమెతో డాన్స్ చేయడం వరకు మొత్తం వెరైటీగా ప్రవర్తించారు. చివరకు ఊహించని విధంగా ఆమె కాళ్ళమీద పడ్డారు.
బుధవారం ఓ ఫోటో షేర్ చేసి.. ఆ ఫొటోలో బ్లూ స్విమ్ సూట్ లో ఉన్న మహిళ తన లవర్ అని చెప్పుకొచ్చారు. ఆమె పేరు సత్య అని తెలియజేసిన వర్మ… విజయవాడ సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న సమయంలో తామిద్దరం లవర్స్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె యూఎస్‌లో మెటర్నిటీ డాక్టర్‌గా పని చేస్తుందని తెలిపారు.
ఆ రోజుల్లో మెడికల్ కాలేజీ మరియు ఇంజనీరింగ్ కాలేజ్ కొన్ని కారణాల వలన ఒకే కాంపౌండ్‌లో ఉన్నాయి. ఆ సమయంలో ఆమెని ఇష్టపడ్డాను. కాని ఆమె అందంగా, డబ్బులు ఉన్న వ్యక్తి కారణంగా నన్ను పట్టించుకోలేదని భావించాను. ఈ కారణంగానే నేను రంగీలా స్టోరీ రాసుకున్నాను అని వర్మ పేర్కొన్నాడు. వర్మ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
