Risk : ‘రిస్క్’ రిలీజ్ డేట్ అనౌన్స్.. సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన..
మీరు కూడా ఈ సాంగ్ వినేయండి.. (Risk)
- Saketh U
- Published on- June 15, 2026 / 09:18 PM IST
Risk
Risk : పలు సినిమాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘రిస్క్’. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ మెయిన్ లీడ్స్ లో ఈ సినిమా తెరకెక్కింది. జోయా జవేరి, రాజీవ్ కనకాల,అనీష్ కురువిల్లా, తరుణ్ సాగర్, రవీంద్రనాథ్ ఠాగూర్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
రిస్క్ సినిమా జూన్ 26న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్, పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేసారు. దేవుడు వరమందిస్తే.. అనే మెలోడీ సాంగ్ ని డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఈ పాటకు సంబంధించిన హుక్ స్టెప్‌తో రీల్స్ లేదా డాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో #DevuduVaramandisthe #RISKMovie #SandeepAshwa ట్యాగ్ చేస్తే బెస్ట్ వీడియోలకు చిత్ర యూనిట్ ప్రత్యేక నగదు బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించింది.
Also Read : Thankyou Subbarao Trailer : ‘థాంక్యూ సుబ్బారావు’ ట్రైలర్ రిలీజ్.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..
