ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి వార్నర్ బర్త్ డే గిఫ్ట్
- vamsi
- Published on- May 20, 2020 / 07:16 AM IST
కరోనా ప్రభావంతో ప్రస్తుతం ప్రపంచమంతా లాక్ డౌన్ పాటిస్తోంది. దీనితో సామాన్య ప్రజలు, సెలెబ్రిటీలు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. సెలెబ్రిటీలు ఇళ్లలోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులని ఎంటర్టైన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మైదానంలో బౌలర్లపై చిచ్చర పిడుగులా రెచ్చిపోయే వార్నర్ ప్రస్తుతం ఇంట్లో తన భార్య, పిల్లలతో కలసి టిక్ టాక్‌లో రచ్చ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా వార్నర్ టాలీవుడ్ సినిమా పాటలు, డైలాగులతో టిక్ టాక్ వీడియోలు చేస్తుండగా.. లేటెస్ట్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టన రోజు సంధర్భంగా ఎన్టీఆర్ పాటతో అలరించాడు.
ఎన్టీఆర్ పుట్టిన రోజు సంధర్భంగా జనతా గ్యారేజ్ సినిమా నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కా లోకల్ పాటకు భార్యతో కలిసి స్టెప్పులేశాడు.. అనంతరం ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తారక్.. నీలాగ డ్యాన్స్ వెయ్యడానికి ట్రై చేశా.. చాలా ఫాస్ట్‌గా వేశావు.. అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
