RRR : మెగా – నందమూరి ‘దోస్తీ’.. సోషల్ మీడియా షేక్ అవుతోంది..!
డిఫరెంట్ వేస్‌లో ఫ్రీడం కోసం ఫైట్ చేస్తున్న టైంలో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల మధ్య ఫ్రెండ్ షిప్ కుదిరితే ఎలా ఉంటుంది..?
- sekhar
- Published on- August 1, 2021 / 12:25 PM IST
Rrr
RRR: డిఫరెంట్ వేస్‌లో ఫ్రీడం కోసం ఫైట్ చేస్తున్న టైంలో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల మధ్య ఫ్రెండ్ షిప్ కుదిరితే ఎలా ఉంటుంది..? వాళ్లు కలిసి జర్నీ చేస్తే దాని గమ్యం ఏంటి..? జక్కన్న ఐడియానే అదిరింది కదూ..! తనకొచ్చిన క్రేజీ థాట్‌ని బిగ్ కాన్వాస్ మీద భారీ బడ్జెట్‌తో చెప్పబోతున్నారు దర్శకధీరుడు రాజమౌళి.
RRR Dosti : ‘పులికి, విలుకాడికి’ రామ్, భీమ్ ‘దోస్తీ’..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లు చేయిస్తూ.. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద దానయ్య కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం, రణం, రుధిరం’..
ఫ్రెండ్షిప్ డే స్పెషల్‌గా ‘దోస్తీ మ్యూజిక్ వీడియో’ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ వీడియోలో చరణ్, తారక్ ఇద్దరూ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. కీరవాణి సింగర్స్‌తో కలిసి మ్యూజికల్ మ్యాజిక్ చేశారు. విజువల్స్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. మెగా – నందమూరి అభిమానులు ‘దోస్తీ’ పాటను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది ‘దోస్తీ’ మ్యూజిక్ వీడియో.
ఈ ‘దోస్తీ’ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాశారు.. తెలుగులో హేమచంద్ర, అమిత్ త్రివేది (హిందీ), అనిరుధ్ (తమిళ్), విజయ్ జేసుదాస్ (మలయాళం), యాసిన్ నిజార్ (కన్నడ) భాషల్లో ఈ పాటను చాలా చక్కగా పాడారు. ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ బరిలో దిగబోతోంది.
