అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కలిస్తే #RRR మూవీ

#RRR మూవీ కథను రివిల్ చేశారు డైరెక్టర్ రాజమౌళి. కథను వివరించారు. 1920 కథకు సంబంధించినది. పిక్షన్ స్టోరీని రియల్ క్యారెక్టర్లతో తీస్తున్నట్లు వెల్లడించారాయన.

  • Publish Date - March 14, 2019 / 06:22 AM IST

#RRR మూవీ కథను రివిల్ చేశారు డైరెక్టర్ రాజమౌళి. కథను వివరించారు. 1920 కథకు సంబంధించినది. పిక్షన్ స్టోరీని రియల్ క్యారెక్టర్లతో తీస్తున్నట్లు వెల్లడించారాయన.

#RRR మూవీ కథను రివిల్ చేశారు డైరెక్టర్ రాజమౌళి. కథను వివరించారు. 1920 కథకు సంబంధించినది. పిక్షన్ స్టోరీని రియల్ క్యారెక్టర్లతో తీస్తున్నట్లు వెల్లడించారాయన. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కథలను కలిపి ఈ స్టోరీ తయారు చేసినట్లు వెల్లడించారు.
Read Also : #RRR మూవీ : రిలీజ్ డేట్ ఫిక్స్, బడ్జెట్ ఎంతో చెప్పేశారు

ఈ విప్లవకారులు యుక్త వయస్సులో ఉన్నప్పటి కథ అన్నారు. అల్లూరి, కొమరం ఇద్దరూ యుక్తవయస్సులో ఉన్నప్పుడు కొన్నాళ్లు ఉత్తరభారతం వెళ్లారని.. తిరిగి జ్ణానంతో వచ్చారన్నారు. ఈ కథాంశాన్ని తీసుకుని సినిమా నిర్మాణం జరుగుతుందన్నారు.
Read Also : #RRR మూవీ : ప్రధాన పాత్రల్లో అజయ్ దేవగన్, అలియా భట్

స్వాతంత్ర సమరంకు ముందు అల్లూరి సీతారామరాజు.. ఉత్తర తెలంగాణ పోరాటవీరుడు కొమరం భీం ఒకే టైమ్‌లో పుట్టారని, అయితే ఇద్దరు కొన్నేళ్లపాటు కనిపించలేదని, అయితే అప్పుడు వాళ్లిద్దరు కలిసి ఉంటే ఏం జరిగి ఉండేది అనే విషయాన్ని లైన్‌గా తీసుకుని ఈ సినిమా తీస్తున్నట్లు రాజమౌళి తెలిపారు. RRR సినిమాలో అల్లూరి సీతా రామరాజుగా రామ్‌చరణ్.. కొమరం భీమ్‌‌గా ఎన్టీఆర్ నటిస్తున్నట్లు తెలిపారు. 
Read Also : #RRR మూవీ అద్భుతంగా ఉంటుంది : ఎన్టీఆర్

ట్రెండింగ్ వార్తలు