Rukmini Vasanth: రుక్మిణి వసంత్ ఎందుకలా చేసింది.. ఎన్టీఆర్ కోసం ధనుష్ కు నో చెప్పింది

ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా కోసం ధనుష్ తో సినిమా చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న రుక్మిణి వసంత్(Rukmini Vasanth).

Rukmini Vasanth missed Dhanush film for NTR Dragon movie

  • ధనుష్ సినిమా నుంచి రుక్మిణి అవుట్
  • డేట్స్ క్లాష్ వల్ల క్రేజీ ఆఫర్ మిస్
  • రుక్మిణి ప్లేస్ లో ధురంధర్ బ్యూటీ సారా అర్జున్

Rukmini Vasanth: కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ‘సప్తసాగరాలు దాటి’ సినిమాతో కుర్రాళ్ల మనసు దోచుకుంది. తన సహజ సిద్ధమైన నటనతో కొద్దీ కాలంలోనే సౌత్ ఇండియాలో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రుక్మిణి(Rukmini Vasanth) కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కావడంతో, దీనిపై ఆమె చాలా ఆశలే పెట్టుకుంది.

Balakrishna- Dimple: హెలికాఫ్టర్ లో బాలయ్యతో డింపుల్ హయతి.. క్రేజీ ఫొటోలు వైరల్

అయితే, షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్న సమయం కంటే ఆలస్యం కావడంతో రుక్మిణికి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ‘డ్రాగన్’ సినిమా కోసం ఆమె అదనంగా బల్క్ డేట్స్ కేటాయించాల్సి రావడంతో, ఇతర భాషల్లో ఒప్పుకున్న ప్రాజెక్టులకు సమయం ఇవ్వలేకపోతోంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన నటించే అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ‘లబ్బర్ పందు’ దర్శకుడితో ధనుష్ చేయబోయే సినిమా నుండి రుక్మిణి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

రుక్మిణి వదులుకున్న ఈ క్రేజీ ఛాన్స్ ఇప్పుడు ధురంధర్ బ్యూటీ సారా అర్జున్‌ను దక్కించుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన సారా, ఇప్పుడు ధనుష్ సినిమాతో హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తెలుగులో ఇప్పటికే ‘యుఫోరియా’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సారాకు, కోలీవుడ్‌లో ఇది పెద్ద బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ, రుక్మిణి మాత్రం ‘డ్రాగన్’ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. మరి డ్రాగన్ సినిమా ఆమెకు ఎలాంటి క్రేజ్ ను అందిస్తుంది అనేది చూడాలి.