యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో 2 వ టీజర్ ఆదివారం రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ భామ శ్రధ్దాకపూర్ బర్త్ డే గిఫ్టుగా టీజర్ రిలీజ్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. బాలీవుడ్ లో పలు చిత్రాలతో బిజీగా ఉన్న శ్రధ్దాకపూర్, స్ట్రీట్ డ్యాన్సర్ అనే బాలీవుడ్ సినిమాతో పాటు సాహో చిత్రం కూడా చేస్తోంది. సాహో చిత్రంతో ఈ అమ్మడు తెలుగు తెరకి తొలిసారి పరిచయం అవుతోంది.
షేడ్స్ ఆఫ్ సాహో- చాప్టర్ 2 పేరుతో మేకింగ్ షాట్స్ ఈ టీజర్ లో ఉన్నాయి. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ సినిమాని తలపిస్తున్నాయి. బుల్లెట్ల వర్షం కురిసింది. చివరకు శ్రద్ధా కపూర్ సైతం గన్ షాట్స్ చెయ్యడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచుకుంటున్నారు. ప్రభాస్, శ్రద్ధా లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. రెండో టీజర్‌లో కూడా ప్రభాస్ చివర్లో కనిపించి బూమ్ అంటూ దుమ్మురేపాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన షెడ్స్ ఆఫ్ సాహో మొదటి ఛాప్టర్‌కు విశేష స్పందన వచ్చింది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సాహో చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్‌నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, మలయాళం యాక్టర్ లాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా 2019 లో ప్రేక్షకలు ముందుకు వస్తందని కూడా వీడియోలో పేర్కోన్నారు. మొత్తానికి ఆదివారం విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో రెండో చాప్టర్ సినిమా పై మరింత అంచనాలు పెంచుతుందనే చెప్పాలి.