ప్రపంచంలోనే మోస్ట్ డిస్‌లైక్డ్ వీడియో.. ‘‘సడక్ 2’’..
- sekhar
- Published On : August 19, 2020 / 02:32 PM IST
సంజయ్ దత్, పూజా భట్, ఆదిత్యరాయ్ కపూర్, ఆలియా భట్ ప్రదాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘సడక్ 2’. 1991లో సంజయ్ దత్, పూజా భట్ జంటగా మహేశ్ భట్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సడక్’కు ఇది సీక్వెల్‌గా ‘సడక్ 2’ రూపొందింది. ఈ సీక్వెల్‌కు కూడా మహేశ్ భట్ దర్శకత్వం వహించారు. విడుదలకు మందే ఈ సినిమా అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.
‘సడక్ 2’ ట్రైలర్ ప్రపంచంలోనే రెండో Most Disliked వీడియోగా రికార్డులకెక్కింది.
బాలీవుడ్‌లో నెపోటిజం కారణంగానే మహేష్ భట్, కరణ్ జోహార్, అలియా భట్, రియా చక్రవర్తి వంటివారు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను తొక్కేశారంటూ.. నెటిజన్లు ‘సడక్ 2’ ట్రైలర్‌కు డిస్ లైక్స్ కొడదామని కంకణం కట్టుకుని ఎట్టకేలకు అన్నంత పని చేశారు. కేవలం డిస్ లైక్ కొట్టడానికే ట్రైలర్ ఓపెన్ చేసినవారూ ఉన్నారంటే.. వారి ఆవేశం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ నెల 28న డిజిటల్ మాధ్యమం DisneyPlus Hotstar VIP ద్వారా ‘సడక్ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
