Sai Dharam Tej: యాక్సిడెంట్‌కు గురైన బైక్ విలువెంతో తెలుసా..
ఈ స్పోర్ట్స్ బైక్ 1160 సీసీతో నడిచే ట్రంఫ్ బైక్. ఇది సరికొత్త హై ఎండ్ బైక్. తేజ్ రీసెంట్‌గా దీనిని కొనుగోలు చేయగా.. దీని నెంబర్ TS07 GJ1258 విలువ దాదాపు..
- Subhan Ali Shaik
- Published On : September 11, 2021 / 09:11 AM IST
Sai Dharam Tej
Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సాయిధరమ్ గాయపడి, ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఛాతీ, కుడి కన్ను, పొట్ట భాగంలో గాయాలు అయ్యాయి. శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో గాయాలకు గురయ్యాడు. స్పోర్ట్స్ బైక్‌పై వెళుతున్న సమయంలో రోడ్డుపై ఇసుక ఉండడంతో బైక్ స్కిడ్ అయి తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.
బాడీలో ఎక్కడ బ్లీడింగ్ జరగలేదని, అవయవాలేవి కూడా పెద్దగా డ్యామేజ్ కాలేదని వైద్యులు వెల్లడించారు. తేజూకి ప్రస్తుతం అపోలోలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైష్ణవ్ తేజ్, పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తుంది. తేజ్ బండి స్కిడ్ కావడానికి కారణం మట్టి, బురద ఉండటం వల్లనే అని అంటున్నారు. ఈ బైక్‌ని రీసెంట్‌గా కొనుగోలు చేసిన తేజ్.. బండి నెంబర్ TS07 GJ1258.
PM Modi : ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారు
రూ.18లక్షలు విలువైన ఈ బైక్… అనిల్ కుమార్ పేరుతో బైక్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఈ స్పోర్ట్స్ బైక్ 1160 సీసీతో నడిచే ట్రంఫ్ బైక్. ఇది సరికొత్త హై ఎండ్ బైక్ అని చెప్పాలి. దీని బరువు 228 కేజీల వరకు ఉంటుంది.
బైక్ రైడింగ్ అంటే తేజ్‌కి చాలా ఇష్టం. షూటింగ్ లేని సమయంలో తన బైక్ లేదా స్నేహితుల బైక్ తీసుకుని సరదాగా రైడింగ్ కు వెళతాడు. శుక్రవారం కూడా అలాగే వెళుతుండగా.. యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదం సమయంలో అతను హెల్మెట్ ధరించి ఉండటంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు.
