Sai Dharam Tej: జల్సా రీ రిలీజ్ లో సుప్రీమ్ హీరో రచ్చ..
మెగా వారసుడిగా తెలుగు తెరకి పరిచయమైన మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో పవన్ అభిమానించే వారిలో నేను ముందు వరుసలో ఉంటా అనే చెప్పే సాయి ధరమ్ తేజ్ కూడా అభిమానులతో కలిసి హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జల్సా స్పెషల్ షోని ఎంజాయ్ చేశారు.
- gum 95921
- Published On : September 2, 2022 / 12:58 PM IST
Sai Dharam Tej celebrates Pawan Birthday along with fans
Sai Dharam Tej: మెగా వారసుడిగా తెలుగు తెరకి పరిచయమైన మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చాడు. ఇటీవల అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన రంగ రంగ వైభవంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తాను మాట్లాడుతూ..పవన్ తనకు గురువు లాంటివాడు అని చెప్పుకొచ్చాడు.
Pawan Kalyan old photos : పవన్ కళ్యాణ్ ఓల్డ్ ఫొటోల గ్యాలరీ
ఇక సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు కావడంతో బుధ, గురువారాలలో పలు చోట్ల పవన్ సూపర్ హిట్ చిత్రాలైన తమ్ముడు, జల్సా సినిమాలను రీ రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ షోస్ తో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఈ స్పెషల్ షోలకు గాను వచ్చే డబ్బుని ఏదొక ట్రస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది అని పవన్ అభిమాన సంఘాలు వెల్లడించాయి.
Pawan Kalyan: నమ్మిన సిద్ధాంతం కోసం శ్రమించే నా తమ్ముడు.. పవర్‌స్టార్‌కి మెగాస్టార్ విషెస్
ఈ క్రమంలో పవన్ అభిమానించే వారిలో నేను ముందు వరుసలో ఉంటా అనే చెప్పే సాయి ధరమ్ తేజ్ కూడా అభిమానులతో కలిసి హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జల్సా స్పెషల్ షోని ఎంజాయ్ చేశారు. తోటి అభిమానులతో కలిసి తను కూడా పేపర్లు ఎగరవేస్తూ సందడి చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఇది చూసినా పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Fan Boy @IamSaiDharamTej Anna❤️❤️❤️❤️#HBDJanasenani #HBDJanasenaniPawanKalyan#PSPK #Jalsa4KCelebrations #SaiDharamTej pic.twitter.com/be6WsgGm6c
— Bhavani (@Bhavani00285593) September 2, 2022
