Sai Dharam Tej: ఆరోజు మళ్ళీ పుట్టాను.. అమ్మే మళ్ళీ నడక, మాటలు నేర్పింది.. సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ఇటీవల ఒక ప్రముఖ డాన్స్ షో ఫినాలేలో పాల్గొన్న ఆయన తన జీవితంలో ఎదురైన అత్యంత కఠినమైన రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
- V Santhosh Kumar
- Updated on- May 2, 2026 / 06:19 PM IST
Sai Dharam Tej emotional comments about the care his mother provided after his accident.
- ప్రమాదం తర్వాత అమ్మే ప్రాణం పోసింది.
- మళ్ళీ నడక, మాటలు నేర్పిన తల్లి.
- అదృష్టవంతుడినంటూ తేజ్ భావోద్వేగ ప్రసంగం.
Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఒక ప్రముఖ డాన్స్ షో ఫినాలేలో పాల్గొన్న ఆయన తన జీవితంలో ఎదురైన అత్యంత కఠినమైన రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఆయనకు 2021లో ఘోర బైక్ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ సంఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని, ఆ ప్రమాదం తర్వాత తాను మళ్ళీ జన్మించానని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో తను అనుభవించిన శారీరక, మానసిక వేదన ఎవరికీ రాకూడదని కోరుకుంటూ, తన పునర్జన్మకు కారణం తన తల్లి అని భావోద్వేగంతో ప్రసంగించారు.
Lahari Shari: నాజూకు నడుమందాలు.. పరువాల వయ్యారాలు.. లహరి గ్లామర్ షో నెక్స్ట్ లెవల్ అసలు
ప్రమాదం తర్వాతి రోజుల్లో తన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, కనీసం చిన్న పిల్లల మాదిరిగా నడవడం, మాట్లాడటం కూడా మర్చిపోయానని తేజ్ వెల్లడించారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో తన తల్లి తనకు అండగా నిలిచి మళ్ళీ నడక నేర్పించిందని, మాటలు నేర్పించిందని పేర్కొన్నారు. కేవలం నడక, మాటలే కాకుండా, వాష్‌రూమ్‌కు తీసుకెళ్లడం దగ్గర్నుంచి ప్రతి చిన్న అవసరాన్ని తనే దగ్గరుండి చూసుకుందని చెబుతూ తన తల్లి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.
తనకు జరిగిన ప్రమాదం వల్ల కలిగిన నష్టం కంటే, తన తల్లి చూపిన ప్రేమ తనను ఒక బలమైన వ్యక్తిగా మార్చిందని సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) అభిప్రాయపడ్డారు. అమ్మ అంతలా సపర్యలు చేయడం వల్లనే తాను ఈరోజు మళ్ళీ స్టేజ్ మీద నిలబడగలిగానని, ఆ విషయంలో తాను చాలా అదృష్టవంతుడినని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎమోషనల్ మాటలు విన్న అభిమానులు మరియు నెటిజన్లు మెగా హీరో మనోధైర్యానికి, ఆయన తల్లి ప్రేమకు సెల్యూట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
