Sai Dharam Tej : ఆరు నెలలు బ్రేక్ తీసుకోని మరో సర్జరీకి వెళ్లనున్న సాయి ధరమ్ తేజ్..
బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఆరు నెలలు బ్రేక్ తీసుకోని మరో సర్జరీకి వెళ్లనున్నాడట.
- gum 95921
- Published On : July 18, 2023 / 07:19 PM IST
Sai Dharam Tej takes six months break from movies to go surgery
Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలయికలో తెరకెక్కుతున్న తమిళ్ రీమేక్ మూవీ ‘బ్రో’ (Bro). తమిళ్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సముద్రఖని.. ఈ రీమేక్ ని కూడా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్ కి సిద్దమవుతుంది. దీంతో సాయి ధరమ్ తేజ్ ప్రమోషన్స్ పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తాను ఆరు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నట్లు వెల్లడించాడు.
సాయి ధరమ్ బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంతో కొన్నాళ్ళు పాటు సినిమాలకు దూరంగా ఉన్న తేజ్.. ఇటీవల విరూపాక్షతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. మూడు నెలల గ్యాప్ లో బ్రో మూవీని కూడా తీసుకు రావడంతో అభిమానులు హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే ఈ సినిమా తరువాత ఆరు నెలలు పాటు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు వెల్లడించి అందర్నీ షాక్ కి గురి చేశాడు. సాయి ధరమ్ తేజ్ ఆ బైక్ యాక్సిడెంట్ నుంచి ఇంకా రికవరీ అవ్వలేదట.
Bro Movie : బ్రో సినిమాలో పవన్ రన్ టైం ఎంతో తెలుసా..? పవన్ స్క్రీన్ పై కనిపించేది..
దానిని నుంచి కోలుకోవడానికి కొంత సమయం తీసుకోవాలని అనుకుంటున్నాడట. అలాగే ప్లేట్స్ తొలిగించడానికి ఒక చిన్న సర్జరీ కూడా ఉన్నట్లు వెల్లడించాడు. కాబట్టి ఒక ఆరు నెలలు పాటు గ్యాప్ తీసుకోని కంప్లీట్ రెస్ట్ లో ఉండి పూర్తిగా కోలుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ప్రెజెంట్ ఎటువంటి సినిమా కథలు కూడా వినలేదని, అయితే ఈమధ్యలో తన ఫ్రెండ్స్ తో కలిసి చేసిన ఒక షార్ట్ ఫిలింని మాత్రం ఇండిపెండెన్స్ రోజు రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. సైనికుల భార్యలు.. తమ భర్తలని దేశం కోసం పంపించి ఎటువంటి త్యాగం చేస్తున్నారు అనేది ఆ షార్ట్ ఫిలిం స్టోరీ అంట.
