Sai Pallavi : బ్యాక్ టు బ్యాక్ రెండు పాన్ ఇండియా సినిమాలు.. రెండు వేరియేషన్స్.. నవంబర్ లో సాయి పల్లవి హవా..
నేచురల్ బ్యూటీ ఇప్పుడు అంతకుమించిన యాక్షన్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. (Sai Pallavi)
- Saketh U
- Published on- October 27, 2026 / 02:58 PM IST
Sai Pallavi
Sai Pallavi : సినిమాల్లో హీరోయిన్లకు వర్సటాలిటీ చూపించే అవకాశాలు రావడం చాలా రేర్. కెరీర్ మొదట్లో ఒక జానర్‌లో నటిస్తే.. అదే తరహా క్యారెక్టర్స్ రావడం కామన్. ఈ విషయంలో సాయిపల్లవి మాత్రం డిఫరెంట్. మొదట్నుంచి వేరువేరు జానర్ల సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది.
కమర్షియల్ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన సాయిపల్లవి ఆ తర్వాత ఎక్స్‌పర్మెంట్స్ మూవీస్ వైపు ఫోకస్ పెట్టారు. అలాగే లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ చేసి బెస్ట్ పర్ఫార్మర్‌గా సత్తా చాటిన నేచురల్ బ్యూటీ ఇప్పుడు అంతకుమించిన యాక్షన్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. ధనుశ్ హీరోగా రాజ్ కుమార్ పెరియార్‌స్వామి తెరకెక్కిస్తోన్న ఓం సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్‌గా నటిస్తున్నారు. నిత్యారెడ్డిగా సాయిపల్లవి ప్లే చేస్తోన్న క్యారక్టర్‌పై నిన్నే స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఓం.. నవబంర్ 20న ఆడియెన్స్ ముందుకొస్తుంది.
అయితే ఓం సినిమా కంటే ముందుగానే నవంబర్‌లో థియేటర్స్‌లోకి వచ్చేస్తోంది రామాయణ. నితేశ్ తివారీ తెరకెక్కించిన ఈ విజువల్ గ్రాండియర్.. దీపావళి సందర్భంగా నవంబర్ 5న విడుదలవుతుంది. ఇప్పటికే ట్రైలర్, టీజర్స్ తో రామాయణాన్ని గ్రాండ్ గా చూపించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు ఇప్పటికే స్టార్టైన అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. 137 నగరాలు, పట్టణాల్లో 4వేల339 షోలకు ఒక కోటి 85లక్షలకిపైగా టికెట్ల అమ్మకాలతో 10 కోట్లకిపైగా రిలీజ్ కి పది రోజుల ముందే కలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
భారీ స్టార్‌కాస్ట్‌తో వస్తోన్న రామాయణ సినిమాలో సీతగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి పర్ఫార్మెన్స్‌పై ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు అభిమానులు. ఇలా నవంబర్‌లో షార్ట్ గ్యాప్‌లో బ్యాక్ టు బ్యాక్ రామాయణ, ఓం సినిమాలతో ఆడియెన్స్ ముందుకొస్తుంది సాయి పల్లవి. రెండు పాన్ ఇండియా సినిమాలు రెండు వేరియేషన్స్ తో కనిపించబోతుంది. మరి ఈ రెండు సినిమాలతో సాయి పల్లవి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
ఈ రెండు సినిమాల తర్వాత వచ్చే సంక్రాంతికి మరో ఇంట్రస్టింగ్ లవ్‌స్టోరీతో వచ్చేందుకు రెడీ అవుతుంది సాయి పల్లవి. మణిరత్నం డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి, సాయిపల్లవి జోడీగా తెరకెక్కుతోన్న ఇంజి వెల్లమ్ 2027 జనవరిలోనే విడుదలకి రెడీ అవుతోంది. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో సెన్సిబుల్ ప్రేమకథగా ఇంజి వెల్లమ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ మణిరత్నం.
