Love Story Magical Success Meet : కింగ్‌కి సాయి పల్లవి సర్‌ప్రైజింగ్ హగ్..
‘లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్’ లో సాయి పల్లవి.. కింగ్ నాగార్జునకు లవ్లీ హగ్ ఇచ్చింది..
- sekhar
- Published On : September 29, 2021 / 02:27 PM IST
Sai Pallavi
Love Story Magical Success Meet: సరైన టైం లో సరైన సినిమా పడితే ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుంది అనే దానికి చక్కని ఉదాహరణగా నిలిచింది ‘లవ్ స్టోరీ’ సినిమా.. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్స్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’ సెప్టెంబర్ 24న థియేటర్లలో భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది.
Love Story : అందుకే వైష్ణవ్ తేజ్ వద్దన్నాడా..?
సినిమాను ఇంత సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలపడానికి మూవీ టీం ‘లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్’ ఏర్పాటు చేశారు. కింగ్ నాగార్జున, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారని చెప్పారు కానీ అనివార్య కారణాల వల్ల సుకుమార్ రాలేకపోయారు.
Kajal Aggarwal : నాగ్ సినిమా క్యాన్సిల్.. కాజల్ కన్ఫమ్ చేసేసిందా..?
ఇక కింగ్ నాగార్జున సినిమా గురించి తన ఆనందాన్ని మూవీ టీం అండ్ ఆడియన్స్‌తో షేర్ చేసుకున్నారు. ఇక సాయి పల్లవి, నాగార్జునను ఆప్యాయంగా హత్తుకోవడం సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె అలా హఠాత్తుగా హగ్ చేసుకోవడంతో నాగ్ సర్‌ప్రైజ్ అయ్యారు. ఇద్దరూ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. సాయి పల్లవి, నాగ్‌ని హగ్ చేసుకున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
