Vijay Deverakonda : విజయ్ దేవరకొండని ప్రశాంత్ నీల్ ఎందుకు కలుసుకున్నాడు..?

విజయ్ దేవరకొండని ప్రశాంత్ నీల్ ఎందుకు కలుసుకున్నాడు..? విజయ్ తో సినిమానా లేక సలార్ అండ్ NTR31లో..

Vijay Deverakonda : ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ.. తన రేంజ్ విజయాన్ని నమోదు చేయలేకపోయారు. నెక్స్ట్ సినిమాలతో అయిన విజయ్ ఓ సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ కమ్‌బ్యాక్ కోసం విజయ్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం డిఫరెంట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతోందని, విజయ్ కెరీర్ లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుందని, ఈ సినిమాతో సూపర్ కమ్‌బ్యాక్ ఉండబోతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే, ఈ రౌడీ బాయ్ ని రీసెంట్ గా పాన్ ఇండియా యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలుసుకున్నారు.

Also read : Prasanth Varma : మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే అంటున్న దర్శకుడు.. అంటే చిరంజీవేనా..?

రీసెంట్ గా ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ ఇంటికి అతిథిగా వెళ్లారట. విజయ్ దేవరకొండ మేనేజర్ తో ప్రశాంత్ నీల్ ఉన్న ఒక ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ మీటింగ్ ఎందుకు అనేది క్లారిటీ లేదు. విజయ్ తో ప్రశాంత్ నీల్ ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా..? అనే సందేహం కలుగుతుంది. ఇక ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ సినిమా అంటే.. అది పెద్ద విషయమే.

ఈ చర్చతో పాటు సోషల్ మీడియాలో మరి డిస్కషన్ కూడా నడుస్తుంది. విజయ్ సలార్ లేక NTR31లో ఏమైనా గెస్ట్ రోల్ చేయబోతున్నారా..? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రశ్నలు అన్నిటికి క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ నుంచి సమాచారం రావాల్సిందే. కాగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరువాత NTR31 పట్టాలు ఎక్కించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు