Salaar Movie : సలార్ పార్ట్ 1 సినిమా ప్రభాస్‌ది కాదా? పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోనా?

సలార్ టీజర్ లో ప్రభాస్ ఫేస్ కూడా చూపించలేదు. ఇక ట్రైలర్ 3 నిమిషాల 40 సెకండ్స్ ఉన్నా ట్రైలర్ ఆల్మోస్ట్ సగం అయ్యాక ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు.

Salaar Movie Story Prabhas or Prithviraj Sukumaran Hero in Movie talk goes Viral

Salaar Movie : అభిమానులు, ప్రేక్షకులు ప్రభాస్(Prabhas) సలార్ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో భారీగా తెరకెక్కిన సలార్ సినిమా రెండు పార్టులుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మొదటి పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సలార్ పార్ట్ 1 ట్రైలర్ నిన్న డిసెంబర్ 1న రిలీజయిన సంగతి తెలిసిందే.

ఈ ట్రైలర్ లోనే ప్రశాంత్ నీల్ ఆల్మోస్ట్ కథ చెప్పేశాడు. చిన్నప్పుడే ఇద్దరు మిత్రులు విడిపోతారు. ప్రభాస్, తన స్నేహితుడు పృథ్వీరాజ్ కి చిన్నప్పుడు ఒక మాట ఇచ్చి నీకు ఎప్పుడు సహాయం కావాలన్నా నేను ఉంటాను అని చెబుతాడు. పెద్దయ్యాక పృథ్వీరాజ్ కి ఒక సమస్య వచ్చి ఒక పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో ప్రభాస్‌ని సహాయం అడుగుతాడు. స్నేహితుడు కోసం ప్రభాస్ ఏం చేశాడు? ఇద్దరు స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు అనేదే కథగా ఉండబోతుంది.

అయితే ఈ సినిమా రెండు పార్టులుగా ఉన్న సంగతి తెలిసిందే. సలార్ టీజర్ లో ప్రభాస్ ఫేస్ కూడా చూపించలేదు. ఇక ట్రైలర్ 3 నిమిషాల 40 సెకండ్స్ ఉన్నా ట్రైలర్ ఆల్మోస్ట్ సగం అయ్యాక ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక సినిమా కథ చూస్తుంటే మొదట గంట పైగా చిన్నప్పుడు స్నేహితుల గురించి, పృథ్వీరాజ్ గురించి, అతడి సంస్థానం, అతనికి సమస్య ఇలా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడో ఇంటర్వెల్ కి కానీ ప్రభాస్ రాడని, ప్రభాస్ వచ్చి ఒక మాస్ ఫైట్ సీక్వెన్స్ తర్వాత ఇంటర్వెల్ ఇస్తారని పలువురు అనుకుంటున్నారు.

Also Read : ప్రభాస్ సలార్ సినిమా.. ఆ సినిమా కథ ఒకటేనా? ముందునుంచి అనుకున్నదే అయిందా?

సోషల్ మీడియాలో కూడా సలార్ పార్ట్ 1 సినిమాలో ప్రభాస్ ఎక్కువ సేపు ఉండడని, పార్ట్ 2లో మొత్తం ప్రభాస్ ఉంటాడని, పార్ట్ 1 అంతా పృథ్వీరాజ్ సుకుమారన్ ని చూపిస్తారని అనుకుంటున్నారు. ట్రైలర్ కూడా చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇది నిజమైతే కనుక ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తారు. ఇప్పటికే ఇలా జరగకూడదని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. అసలే బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ ప్రభాస్‌కి పడకపోవడంతో అభిమానులంతా సలార్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు సినిమాలో ప్రభాస్ తక్కువ సేపు కనిపిస్తాడు అంటే అభిమానుల ఆశలు అడియాశలు అవ్వాల్సిందే. మరి ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేశాడో, ప్రభాస్‌ని ఎలా చూపిస్తాడో తెలియాలంటే డిసెంబర్ 22 దాకా ఆగాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు