Vamshi Paidipally Salman Khan : క్రేజీ కాంబో.. సల్మాన్ ఖాన్ ఆశలన్నీ ఆ తెలుగు డైరెక్టర్ పైనే.. ఈసారైనా హిట్టు కొట్టేనా..!
Vamshi Paidipally Salman Khan : క్రేజీ కాంబో గురించి ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అదే దర్శకుడు వంశీ పైడిపల్లి-సల్మాన్ ఖాన్ కాంబో గురించి.
- Dharani Pilli
- Published On : March 30, 2026 / 08:25 PM IST
Salman Khan Teams Up With Vamshi Paidipally And Dil Raju For next Project
Vamshi Paidipally Salman Khan : స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో ఆయన రేంజ్ కు తగ్గ హిట్టు కొట్టి దాదాపు పది సంవత్సరాలు కావస్తోంది. గతేడాది ‘సికిందర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అది ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం సల్మాన్ ‘మాతృభూమి’ అనే దేశభక్తి సినిమా చేస్తున్నాడు. కానీ ఈ సినిమా మీద ఎలాంటి హైప్ క్రియేట్ అవ్వలేదు. అసలు సల్మాన్ ఈ సినిమా చేస్తున్నాడన్న విషయం కూడా పెద్దగా వైరల్ కాలేదు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ కి సంబంధించి క్రేజీ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే సల్మాన్ ఖాన్.. ఓ టాలీవుడ్ దర్శకుడి డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడంట. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్ నటించబోతున్నాడు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఇటు చూస్తే వంశీ పైడిపల్లి ఖాతాలో కూడా సరైన హిట్ పడి చాలా కాలమే అవుతోంది. చివరగా ‘వారసుడు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా వచ్చి మూడేళ్లవుతోంది. కానీ మధ్యలో ఒక్క సినిమా కూడా ప్రకటించలేదు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బాట పట్టాడు. సల్మాన్ ఖాన్ తో తీయబోతున్న సినిమా పాన్ ఇండియా మూవీ అని ప్రచారం. సల్మాన్ ఖాన్ తో పని చేయబోతున్నట్లు వంశీ పైడిపల్లి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి, వారిసు (వారసుడు) సినిమాలతో ఓ మాదిరి హిట్లు సాధించిన దర్శకుడు వంశీ పైడిపల్లి.. మూడేళ్ల తర్వాత ఇప్పుడు కొత్త సినిమాని ప్రకటించాడు. అది కూడా సల్మాన్ ఖాన్ తో. ఏప్రిల్ రెండో వారం సల్మాన్-వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని సమాచారం. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
