Kurkure బ్రాండ్ అంబాసిడర్ సమంత : ట్విట్టర్లో నెటిజన్ల విమర్శలు
- madhu
- Published on- March 13, 2019 / 04:13 AM IST
ప్రముఖ కంపెనీలు జనాలను ఆకర్షించడానికి ఎత్తులు వేస్తుంటాయి. ప్రచారాలను నిర్వహిస్తూ వినియోగదారులను తమవైపు లాక్కొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. అందులో భాగంగా సినీ నటులను తమ తమ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఏర్పాటు చేసుకుంటారు. ఈ ప్రచారం కొన్ని సార్లు నటులకు తలనొప్పిగా మారుతుంటాయి. కొంతమంది వినియోగదారులు కోర్టుకు కూడా ఎక్కిన సందర్భాలున్నాయి. తాజాగా సమంత కూడా ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. అయితే దీనిపై పలు విమర్శలు వస్తున్నాయి.
Read Also : బికినీ వేసుకుంటే: నెటిజన్‌పై హీరోయిన్ ఆగ్రహం
తమిళనాడులోని కుర్ కురే కంపెనీకి టాలీవుడ్ నటి సమంత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జంక్ ఫుడ్ సంస్థకు ప్రచారం ఎలా నిర్వహిస్తారంటూ నెటిజన్లు కోపం ప్రదర్శిస్తున్నారు. ప్రజలకు ఏమైనా పనికొచ్చే ఆహారమా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారా ? అంటూ కొంతమంది విమర్శలు కురిపించారు. మరి సమంత దీనిపై ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.
తమిళ మీడియా ఇండస్ట్రీలో కుర్ కురే 2008లో ఎంట్రీ ఇచ్చింది. 2008లో నటి సిమ్రాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగా 2004లో బాలీవుడ్ నటి జూహ్లీచావ్లా ఉన్నారు. 2012లో పరిణితీ చోప్రా , కునాల్ కపూర్, బొమన్ ఇరానీ, రమ్య కృష్ణలు ప్రచారకర్తలుగా ఉన్నారు.
