Maa Inti Bangaram : బాక్సాఫీస్ వద్ద సమంత జోరు.. మా ఇంటి బంగారం 3 డేస్ కలెక్షన్స్ ఎంతంటే? బ్రేక్ ఈవెన్‌కు ఇంకెంత కావాలంటే?
సమంత లీడ్ రోల్లో నటించిన మా ఇంటి బంగారం (Maa Inti Bangaram) మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
Samantha Maa Inti Bangaram 3days collections
Maa Inti Bangaram : సమంత లీడ్ రోల్లో నటించిన మూవీ ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా 43 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని ఓ సరికొత్త పోస్టర్ ద్వారా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
Samantha : నా బిడ్డే నా ప్రపంచం.. ఏళ్ల పాటు.. సమంత

ఇదిలా ఉంటే.. ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ 25 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను చేరుకోవాలంటే 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ లెక్కన మరో ఏడు కోట్లు వసూళ్లను మా ఇంటి బంగారం సాధిస్తే బ్రేక్ ఈవెన్ ను చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీకి ఉన్న బజ్‌ను చూస్తుంటే ఈ రోజే బ్రేక్ ఈవెన్‌ను చేరుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గౌతమి, శ్రీలక్ష్మి, శ్రీముఖి, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు, సమంత భర్త రాజ్ నిడిమోరు ఈ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వయంగా సమంత ఈ మూవీని నిర్మించింది.
#MaaIntiBangaaram grosses 43 CRORES WORLDWIDE IN 3 DAYS 🔥🔥
A massive weekend at the box office with families owning the film ❤️
Watch the BLOCKBUSTER 𝐒𝐀𝐌BHAVAM #MaaIntiBangaaram in theatres today ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/P89ifZn9Ss@TralalaPictures… pic.twitter.com/U6ODFgXUST— Tralala Moving Pictures (@TralalaPictures) June 22, 2026
