Maa Inti Bangaram: సమ్మర్ లో సమంత యాక్షన్.. మా ఇంటి బంగారం రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్
సమంత మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.
- V Santhosh Kumar
- Published On : February 23, 2026 / 07:12 AM IST
Samantha Maa Inti Bangaram movie to be released in May
Maa Inti Bangaram: సౌత్ బ్యూటీ సమంత రెండో పెళ్లి తరువాత చేస్తున్న మొదటి సినిమా మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సామ్ భర్త రాజ్ నిడిమోరు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత యాక్షన్ మోడ్ లో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా సమంత తెలుగులో చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Anurag Kashyap: బలవంతంగా బీఫ్ తినిపిస్తారా.. కేరళ స్టోరీ మూవీపై అనురాగ్ షాకింగ్ కామెంట్స్
ఈ నేపధ్యంలోనే తాజాగా మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. సమ్మర్ కానుకగా మే 15న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో భాగంగా సమంత స్పెషల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇక చాలా కాలం తరువాత సమంత నుంచి సినిమా వస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి చాలా కాలం తరువాత సమంత చేస్తున్న ఈ సినిమా ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుంది అనేది చూడాలి.
